ఇన్ సైడ్ టాక్: అంతా పొలిటికల్ డ్రాామానా? | political angle in kamal-gautami break up

Political angle in kamal gautami break up

Kamal Hassan break up with Gautami, Gautami political entry, Gautami eyed on TN politics, Gautami joins in BJP, Gautami BJP, Kamal Gautami break up, shruthi not reason for break up, Kamal Hassan Gautami

For Political Arangetram actress Gautami break up with Kamal Hassan.

గౌతమీ-కమల్ బ్రేకప్ లో కొత్త కోణం

Posted: 11/03/2016 08:54 AM IST
Political angle in kamal gautami break up

కమల్ హాసన్ తో పదమూడు సంవత్సరాల సహజీవనం సంబంధాన్ని తెంచేసుకున్న నటి గౌతమీ ఒక్కసారిగా వార్తల్లో హైలెట్ మారిపోయింది. బ్రేకప్ అనౌన్స్ మెంట్ చేయటం, కొందరు ఆకతాయిల కారణంగా కమల్ స్పందించాడంటూ ఫేక్ న్యూస్ ను చానెళ్లు కూడా వైరల్ చేసేయటం, ఆపై అవి తన కామెంట్లు కావని కమల్ చెప్పేయటం, శృతీ కూడా రెస్పాండ్ అయ్యిందంటూ వార్తలు రావటం ఇలా రెండు రోజులుగా ఈ టాపిక్ పైనే డిస్కషన్.

అయితే కారణం శృతీ హసన్ అయినా, కాకపోయినా ఇప్పడు మరో కోణం వీరి బ్రేకప్ కి కారణమేమో అన్న దానిపై చర్చ మొదలైంది. అదే రాజకీయ కోణం. ఊహించనిదే అయినప్పటికీ, ఇది కూడా ఓ కారణం అయి ఉండొచ్చని పరిశీలకులు చెబుతున్నారు. గౌతమి త్వరలోనే రాజకీయాల్లోకి రావాలని చూస్తోందట. ఆమె ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నాయకులతో సంప్రదింపులు కూడా జరిపింది. త్వరలోనే ఆమె రాజకీయ తీర్థం పుచ్చుకుంటుందని.. 2019 ఎన్నికల్లో పోటీ కూడా చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఐతే కమల్ కు.. రాజకీయాలకు దూరం అన్న సంగతి తెలిసిందే. ఆయన తరచుగా రాజకీయ నాయకులపై.. అవినీతిపై.. వ్యవస్థీకృత లోపాలపై విమర్శలు కూడా గుప్పిస్తుంటారు. ఈ నేపథ్యంలో గౌతమి రాజకీయాల్లోకి వస్తే ఇద్దరికీ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. అంతే కాదు వారి రిలేషన్ గురించి కూడా విమర్శలు వినిపించే పరిస్థితులు ఖచ్ఛితంగా నెలకొంటాయి. ఈ నేపథ్యంలోనే వాళ్లిద్దరూ విడిపోవాల్సి వచ్చిందంటూ చెన్నైలో చర్చలు నడుస్తున్నాయి. అందుకే వివాదాలు లేకపోయినా విడిపోయారనేది ఓ వర్గం అభిప్రాయం. దీనిపై అతిత్వరలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Hassan  Actress Gautami  political reasons  

Other Articles