అనుప్రియను అందుకే తీసుకున్నారా? | Anupriya Patel may announced for UP CM candidate

Anupriya patel may announced for up cm candidate

Anupriya Patel UP CM candidate, Modi UP CM candidate, Anupriya Modi, Anupriya Smriti Irani, Anupriya UP CM

Anupriya Patel may announced for UP CM candidate.

అనుప్రియను అందుకే తీసుకున్నారా?

Posted: 07/06/2016 04:10 PM IST
Anupriya patel may announced for up cm candidate

తన పాలనపై వస్తున్న విమర్శలపై అందుకు తగిన రీతిలోనే సమాధానం చెప్పటం ప్రధాని నరేంద్ర మోదీ స్టైల్. అదే సమయంలో తన సహచరుల కదలికలను ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తారో నిన్న జరిగిన మంత్రి వర్గ విస్తరణను చూస్తే అర్థమౌతోంది. సీనియర్లను మినహాయించి ఆరోపణలు వస్తున్న వారిపై డేగ కన్ను వేసి మరీ ఆరుగురికి ఉద్వాసన పలికారు.

ఇక మంత్రి వర్గంలో ఆయన తీసుకున్న 19 మందికి కూడా ఏ మాత్రం మచ్చలేకుండా ఉండటం విశేషం. ఇంతవరకు వీరిపై ప్రతిపక్షాల నుంచి ఏ విమర్శలు రాకపోవటమే ఇందుకు నిదర్శనం.  కేంద్ర మంత్రివర్గంలోకి తాజాగా తీసుకున్న అనుప్రియ పటేల్ విషయంలో ఇది కాస్త మరీ ప్రత్యేకంగా తోస్తుంది.

 యూపీలో బిజెపి మిత్రపక్షమైన అప్నాదళ్ తరఫున మీర్జాపూర్ లోక్సభకు పోటీచేసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఆమె తండ్రి - కుర్మీ సామాజిక వర్గనేత సోనేలాల్ పటేల్ అప్నాదళ్ పార్టీని ఏర్పాటు చేశారు. 2009లో ఆయన మృతి చెందడంతో తల్లి కృష్ణపటేల్ పార్టీ పగ్గాలు చేపట్టారు. తరువాత పార్టీలోనూ విభేదాలు తలెత్తాయి. అనుప్రియ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సొంత తల్లే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో అనుప్రియకు మోదీ కేబినెట్ లో ఆమెకు చోటు దక్కడం ఆశ్చర్యకరమే అయినప్పటికీ దాని వెనక బలమైన కారణం ఉన్నట్లు గోచరిస్తోంది.

రాజకీయాలకు ముఖచిత్రంగా భావించే యూపీ ఎన్నికలపై ప్రధాని అసలు దృష్టిసారిస్తున్నారా అన్న అనుమానాలకు చెక్ పెడుతూ అనుప్రియను ఎంపిక చేసినట్లు అర్థమౌతోంది.  ప్రధాని మోదీకి విధేయురాలిగా భావిస్తున్న అనుప్రియను యూపీ సీఎం అభ్యర్థిగా నిలబెట్టాలన్న ఆలోచనలో మోదీ ఉన్నట్లు తెలుస్తోంది. యూపీలో అప్నాదళ్కు బలమైన ఓబిసి ఓటు బ్యాంకు ఉండటం, పైగా ఆమె రాజకీయ నేపథ్యం అంతా బాగుండటంతోనే ఆమెను కేబినెట్ లోకి తీసుకునేందుకు సంకోచించలేదని తెలుస్తోంది.

అఖిలేష్ లాంటి స్థానిక బలం ఉన్న నేతను ఈ 35 ఏళ్ల మహిళా నేతతోనే చెక్ పెట్టించాలన్న ఆలోచన సరైంది కాదని తోటి నేతలు చెబుతున్నప్పటికీ అందుకు మోదీ ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యూపీ సీఎం బరిలో ఎప్పటి నుంచో పేరు వినిపిస్తున్న స్మృతి ఇరానీ లాంటి ఇది షాకిచ్చే న్యూస్ అయినప్పటికీ అనుప్రియను తీసుకునే విషయంలో ప్రధాని వ్యూహాత్మకంగానే వ్యవహరించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  Anupriya Patel  UP CM  

Other Articles