మోదీజీ... ఇలా కూడా దెబ్బకొట్టొచ్చా? | modi's pv memorial idea work outs

Modi s pv memorial idea work out

PV kin subash, PV sonia, modi PV, PV memorial, PV narasimha rao, PV kin subash, PV sonia, modi PV, PV memorial, పీవీ మెమోరియల్, తాజా వార్తలు, తెలుగు వార్తలు, national news, modi newsm PV memorial Modi, Modi at PV memorial, national politics, political news, జాతీయ వార్తలు, రాజకీయాలు, మోదీ పీవీ, పీవీ మెమోరియల్ వద్ద మోదీ, ప్రధాని మోదీ, మాజీ ప్రధాని పీవీ మెమోరియల్, పీవీ మనవడు సుభాష్, పీవీ వారసుడు మోదీ, పీవీ మనవడు సోనియాగాంధీ, సోనియాగాంధీ పీవీ

PV kin subash scold sonia says she never respect PV and try to insult every where. Sonia Gandhi did everything to belittle PV Narasimha Rao, says kin. “P.V.'s memorial is almost ready and will be opened on June 28, on his 95th birth anniversary

మోదీజీ... ఇలా కూడా దెబ్బకొట్టొచ్చా?

Posted: 06/22/2016 06:03 PM IST
Modi s pv memorial idea work out

సొంత వేలితో కన్నును పొడించడమంటే ఏంటో దేశ ప్రధాని నరేంద్ర మోదీని చూసి నేర్చుకోవాలి. అదికారంలోకి వచ్చాక నరేంద్ర మోదీ ఓవైపు పాలనతోపాటు ప్రత్యర్థుల నోళ్లు మెదపకుండా ఉండేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతూనే ఉన్నాయి. ఆరోపణలకు దిగేలోపే ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా పనులను చక్కబెడుతూ అవకాశం ఇవ్వకుండా చేస్తున్నాడు.

అదే టైంలో ప్రతిపక్ష కాంగ్రెస్ ను ఎన్నిరకాలుగా దెబ్బకొట్టాలో అన్ని రకాలుగా దెబ్బతీస్తున్నాడు. తాజాగా మాజీ ప్రధాని పీవీ నరసింహరావు విషయంలో మోదీ తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ పరువు గంగలో కలసిపోయింది. పీవీ మనవడు, కాంగ్రెస్ నేత ఎన్వీ సుభాష్ చేసిన కామెంట్లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. సుభాష్ ఒకప్పుడు కాంగ్రెస్ లోనే క్రియాశీలకంగా కొనసాగారు. అయితే పార్టీ పెద్దగా పట్టించుకోకపోవటంతో కార్యాకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

అయితే సోనియాగాంధీ అసలు ఏనాడూ పీవీని గౌరవించలేదంటూ ఆయనిప్పుడు సంచలన వ్యాఖ్య చేశాడు. చరిత్రపుటల్లో పీవీ నరసింహారావుకి స్థానం లేకుండా సోనియా ప్రయత్నించిందని..చివరిరోజుల్లో ఘోరంగా అవమానించిందని తెలిపాడు. ప్రధానిగా పీవీ ఎన్నికైన సమయంలో రెండేళ్లకు మించి కొనసాగడని సోనియా భావించారంట. ఆఖరికి ఆయన అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించేందుకు ఆమె సుముఖత చూపలేదని సుభాష్ చెబుతున్నాడు. కానీ, ఎన్డీయే ప్రభుత్వం మాత్రం  పీవీ ప్రాధాన్యతను గుర్తించినందుకు సంతోషమని చెబుతున్నాడాయన.

జూన్ 28న పీవీ 95వ జయంతి. ఆ రోజున ఢిల్లీలో పీవీ మోమొరియల్ భవనానికి మోదీ శంకుస్థాపన చేసేందుకు సిద్ధమైపోతున్నారు. అంతేకాదు వచ్చే ఏడాది భారత రత్నకు కూడా పీవీ పేరును సిఫార్సు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ అవసానదశలో ఉన్న టైంలో తన చాతుర్యంతో గట్టెక్కించిన ఓ తెలుగు తేజాన్ని సొంత పార్టీ గుర్తించకపోవటం అనే మైనస్ ను మెమోరియల్ పేరిట తనకు ఫ్లస్ గా మార్చుకున్న మోదీ, ఈ రకంగానూ కాంగ్రెస్ పై పైచేయి సాధించినట్లయ్యింది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PV narasimha rao  PV kin subash  PV sonia  modi PV  PV memorial  

Other Articles