కాపు కాపరి బాధేంటో? | mudragada indefinite fast create chaos in AP

Mudragada indefinite fast create chaos in ap

mudragada indefinite fast, chaos in AP, ముద్రగడ దీక్ష, ముద్రగడ మొండిపట్టు, ముద్రగడ ఆమరణదీక్ష, ముద్రగడ దీక్షతో ఏపీలో అల్లర్లు, ఏపీ వార్తలు, తాజా వార్తలు, latest news, telugu news, AP politics, kapu reservation

mudragada indefinite fast create chaos in AP. Big headache to AP CM chandrababu naidu.

కాపు కాపరి బాధేంటో?

Posted: 06/11/2016 12:57 PM IST
Mudragada indefinite fast create chaos in ap

కాపులకు రిజర్వేషన్లు కావాలంటూ డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం చేపట్టిన మరోసారి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తీవ్ర కలకలం రేపుతోంది. ఓవైపు రాష్ట్రాభివృద్ధికి సహకరించని మిత్రపక్షం వ్యవహార శైలితోనే సతమతమవుతున్న సీఎం చంద్రబాబుకి ఈ కుల ఉద్యమం ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. సానుకూలంగా ఉన్నప్పటికీ, అరెస్టుల వంకతో ముద్రగడ చేస్తున్న రాద్ధాంతం పై బాబుతోపాటు మంత్రివర్యులంతా అసహానం వ్యక్తం చేస్తున్నారు. విధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయకుండా ఉరేగించాలా అంటూ సూటిగా ప్రశిస్తున్నారు.  

తుని ఘర్షణల్లో జరిగిన వ్యవహారంపై విచారణ చేపట్టింది మాములు పోలీసులు కాదు. సీఐడీ మూడు నెలలు విచారణ జరిపి మరీ ఈ అరెస్ట్ లు చేసింది. అలాంటప్పుడు అమాయకులను అరెస్ట్ చేస్తున్నారన్న ముద్రగడ వాదనలో పసలేదంటున్నారు. దమ్ముంటే అరెస్ట్ చేయడంటూ పోలీసులపై ఎదురు దాడి చేయటం, పురుగుల మందు డబ్బాతో బెదిరించడం వెనుక పరోక్షంగా అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పాలనాపరంగా తీవ్ర గజిబిజిలో ఉన్న ప్రభుత్వానికి కష్టకాలంలో సహకరించాల్సింది పోయి మరింత ఇబ్బందికరమైన పరిస్థితులను ఆయన సృష్టిస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. .

దీనికి అదనంగా ఏకంగా కాపుల మధ్యే ఆయన చిచ్చు పెడుతున్నాడన్నది ఇప్పుడు కొత్త ఆరోపణ వినిపిస్తోంది. ముద్రగడ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే చర్చలు నిర్వహించుకుంటున్నారు. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా ఇవి ఇప్పుడు మారాయి. కాపు ఉద్యమనేత అరెస్టుకు నిరసనగా విజయవాడలో అనుకూల వర్గం సమావేశం నిర్వహించగా, మంగళగిరిలో వ్యతిరేక వర్గం సమావేశం నిర్వహించింది. ప్రభుత్వ అరెస్టులకు అడ్డుపడడం న్యాయమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా గ్రూపులు ఏర్పడటానికి ముద్రగడ మొండివైఖరే కారణమని తెలుస్తోంది. ఈ కీలక మలుపులు మరెన్ని పరిణామాలకు దారితీస్తాయోనని విశ్లేషకులు ఎదురుచూస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారో అన్నది పక్కనబెడితే రిజర్వేషన్లకు అంగీకరించి, చర్చలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక దీక్షలు ఎందుకన్న ప్రశ్నలు మాత్రం ఉద్భవించకమానవు.  

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mudragada indefinite fast  chaos in AP  kapu reservation  

Other Articles