ష్... గప్ చుప్ | BJP strategy change on AP politics

Bjp strategy change on ap politics

AP BJP, BJP TDP 2019, BJP strategy on AP, తాజా వార్తలు, తెలుగు వార్తలు, గాసిప్స్, ఏపీ పాలిటిక్స్, ఏపీ బీజేపీ, బీజేపీ ఆంద్రప్రదేశ్ రాజకీయాలు, బీజేపీ టీడీపీ పొత్తు, latest news, telugu news

BJP strategy change on AP politics. continue to alliance with TDP.

ష్... గప్ చుప్

Posted: 06/08/2016 03:39 PM IST
Bjp strategy change on ap politics

ఏపీపై కమలనాథుల వైఖరి క్రమంగా మారుతూ వస్తోంది. విమర్శలకు మౌనంగానే సమాధానమివ్వాలని చూస్తోంది. మిత్రపక్షంతో గోడవలను పక్కనబెట్టి ముందుకు సాగాలని బీజేపీ నిర్ణయించినట్లు తాజా పరిణామాలను చూస్తే అర్థమౌతోంది. ప్ర్యతేకం అంశంను సైడ్ చేసేయడంతో పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. టీడీపీతో సహా అన్ని పార్టీలు దాదాపుగా ఏకమౌతున్నాయన్న పోరాటానికి దిగుతున్నాయన్న దశలో రక్షణ చర్యలు ప్రారంభించేసింది.

ఇందులో భాగంగానే రాజ్యసభ సీటు వ్యవహారంలో చంద్రబాబుతో ఫోన్ కాల్స్ సంప్రదింపులు, నోరే జారుతున్న నేతలతో క్షమాపణలు చెప్పించడం వెరసి పార్టీ పునాదులు ఊడకుండా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న రాష్ట్రల ఎన్నికల ఫలితాలలో కూడా ఆ పార్టీకి ఘనమైన విజయాలు ఏం అంత సొంతం కాకపోవటం కూడా మరో కారణంగా చెప్పవచ్చు. 2019 ఎన్నికల నాటి కల్లా స్వతంత్ర్యంగా పోటీ చేసే సీన్ లేకపోవటంతో కనీసం జనసేన అండతో ముందుకు వెళ్లాలన్నది ఫ్లాన్ తో ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే జనాల్లో సానుకూలత మూటగట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది గమనించే దిద్దుబాబు చర్యలకు దిగింది బీజేపీ అధిష్టానం. ప్రత్యేక హోదా అన్న భావోద్వేగాలతో ముడిపడిన అంశాన్ని మెల్లిగా సైడ్ చేసి ఆర్థిక ప్రగతి కోసం ప్రత్నామ్నాయ మార్గాలను రూపొందించాల్సిందిగా మోదీ ఇప్పటికే కమలం బాస్ అమిత్ షాకు సూచించాడంట

ఇక మొన్న పార్లమెంట్ లో పనిచేసిన రివర్స్ ఎటాక్ ను మళ్లీ ప్రయోగించేందుకు సిద్ధమైంది. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుల మూలంగానే ఇప్పుడు అనుభవించాల్సి వస్తుందని నవ నిర్మాణ దీక్ష లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే దీనికి తార్కాణంగా తెలుస్తోంది. అదే టైంలో ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే అంశంపై ఇప్పుడు బీజేపీ మేధోమధనం జరుపుతోంది. మరోవైపు తమ ప్రాంతీయ నేతలపై ప్రజల్లో సింపథీ పెరిగేందుకు త్వరలో వారితో ఓ ఢిల్లీ టూర్ వేయించనుందట. వారంతా మోదీతోసహా పలువురు కీలకనేతలను కలిసి ప్ర్యతేకంపై గళం విప్పుతారంట. తద్వారా హడావుడిగా ఏదో జరగబోతుందన్న సీన్ క్రియేట్ చేయటం, ఆపై కొంతైనా మంచి మార్కులు కొట్టేయాలని వారి ఆలోచన.

అదే టైంలో సోము వీర్రాజు లాంటి కొంతమంది బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో పార్టీకి పెద్ద తలనొప్పులు రాకుండా, ఓ సమావేశం నిర్వహించి గట్టిగా వారించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సీనియర్ నేత, పార్టీ ఇన్ ఛార్జ్ సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్ నేతృత్వం వహించనున్నారు. ఇక పార్టీలో టీడీపీతో మైత్రి కొనసాగించడం మూలంగా చీలికలు లేకుండా ముందుకు వెళ్లాలని పార్టీ యోచిస్తోంది. వెరసి ఎన్నికల నాటికి ఏపీలో పార్టీ గట్టి పడాలన్న ముందస్తు ఆలోచనతో బీజేపీ ముందుకు పావులు కదిపేందుకే ఇప్పుడు సైలెంట్ గా ఉందన్నది ఓ వాదన.   

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP BJP  BJP-TDP alliance  2019 AP elections BJP  

Other Articles