నిర్మలమ్మకు అసలువేం పట్టవా? | nirmala sitaraman explained what she did to AP for 2 years

Nirmala sitaraman explained what she did to ap for 2 years

Nirmala Sitharaman, commerce minister, AP development, two years, తాజావార్తలు, ఏపీ రాజకీయాలు, గుసగుసలు, గాసిప్స్, రాజకీయాలు, తెలుగు వార్తలు, latest news

Nirmala Sitharaman on Saturday said she has utilised the entire amount under the MPLAD scheme and facilitated setting up of several projects.

నిర్మలమ్మకు అసలువేం పట్టవా?

Posted: 06/06/2016 01:40 PM IST
Nirmala sitaraman explained what she did to ap for 2 years

ఏపీకి చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ఓ వైపు నవనిర్మాణ దీక్ష సాగుతున్న వేళ మీడియా ముందుకు వచ్చి తాను చేసిన ఘనకార్యాలు ఇవి అంటూ ఓ చాంతాడంతా లిస్ట్ ను విడుదల చేసింది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. మొదటి నుంచి ప్రత్యేకంపై మాట్లాడని నేతల్లో ఆమె ఒకరు. సొంత పార్టీ తరపున మద్ధతు మాట్లాడటం పక్కనబెట్టి, ఆరోపణలు చేస్తున్న మిత్రపక్ష వైఖరిని కనీసం ఖండించేందుకు కూడా ఆమెకు ఏనాడూ సమయం చిక్కలేదా? అని ప్రశ్నిస్తున్నారు.

నిజానికి రెండేళ్ల క్రితం రాజ్యసభ బరిలో లేరు. కేవలం బీజేపీలో ఆమె నామమాత్రపు నేతగా మాత్రమే ఉండేవారు. నవ్యాంధ్ర రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు పరకాల ప్రభాకర్ భార్య కావటం, పైగా అభివృద్ధి పనులు త్వరగతిన జరుగుతాయన్న నమ్మకంతో టీడీపీ ఆమెకు మద్ధతిచ్చి పెద్దల సభకు పంపింది. రెండేళ్లు గడిచాక ప్రత్యేకంపై తటపటాయిస్తున్న కేంద్రం ఎందుకైనా మంచిదన్న ఆలోచనతో ఆమెను పొరుగు రాష్ట్ర కర్ణాటక నుంచి ఇప్పుడు బరిలోకి దింపుతోంది. దీనిపై స్పందిచిన ఆమె ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించడం తన పూర్వ జన్మ సుకృతమని వ్యాఖ్యానించింది. దీంతో సాధారణంగానే తెలుగుదేశానికి చిర్రెత్తుకొచ్చింది. అసలు ఈ రెండేళ్ల కాలంలో సొంత రాష్ట్రానికి నువ్వేం చేశావంటూ ఆరాలు తీయటం మొదలుపెట్టింది. సవాల్ ను సీరియస్ గా తీస్కున్న ఆమె సోషల్ మీడియా వేదికగా సమాధానలు కురిపించిది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ (ఎంపిల్యాడ్) పథకం నిధులను దానం చేయటంతోపాటు, వాణిజ్య మంత్రిగా ఏపీ పేరిట ఎంత ఖర్చుపెట్టిందో అందులో వివరించింది.

- విజయవాడ కేంద్రంగా తాత్కాలికంగా కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఏర్పాటుకు అమరావతిలో స్థలాన్ని గుర్తించామని, ఐఐఎఫ్‌టి కోసం భూమిని కూడా గుర్తించామన్నారు. దీనికి   త్వరలో శంకుస్థాపన జరగనుందన్నారు.
- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఏర్పాటుకు త్వరలో శంకుస్థాపన జరగనుందన్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో మెగా లెదర్ క్లస్టర్ ఏర్పాటైందని, భారీ పెట్టుబడులకు, ఉపాధికి దోహదపడేలా ఆసియా    అభివృద్ధి బ్యాంక్ సహకారంతో విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను తీసుకొచ్చానన్నారు.
- ఏపీ మీదుగా చెన్నై-బెంగళూరు కారిడార్‌ను తీసుకెళ్లామని, దీనివల్ల రాయలసీమలోని నేషనల్ ఇన్వెస్టుమెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)కు ప్రయోజనం చేకూరుతుందన్నారు.  
- పొగాకు రైతుల గురించి కూడా శ్రద్ధ వహించానన్నారు. పొగాకు ధరలు పతనమవుతున్న సమయంలో బాసటగా నిలిచానన్నారు.
- తూర్పు తల్లు, పెదమాయినవానిలంక గ్రామాలను సౌరశక్తి ఆధారంగా విద్యుత్‌ను పొందుతున్న తొలి గ్రామాలుగా మార్చానని చెప్పుకొచ్చారు. కేవలం ఇవన్నీ కూడా తమ పార్టీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి     వచ్చిన ఈ రెండేళ్లలో తాను చేసినవని చెప్పారు.

పైన ఆమె పేర్కొన్న వాటిలో ఏ ఒక్కటీ ప్రాముఖ్యత లేని అంశమని ఆర్థికవేత్తల వాదన. వీటి వల్ల రాష్ట్రానికి అదనంగా ఏం చేకూరకపోగా, ప్రభుత్వం ఖజానాపైనే అదనపు భారం పడే అవకాశం ఉందని వారంటున్నారు.  పైగా ఇవన్నీ అదికారంలోకి వచ్చిన మొదట్లో కేంద్రం మొక్కుబడిగా ప్రకటించిన వరాలు. నాడు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయా అంశాలను  ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రం పురోగతికి అదనపు నిధులు, ప్యాకేజీలు మరీ ముఖ్యంగా హోదా లాంటి అంశాలు చాలానే అవసం ఉంది. అలాంటి సమయంలో ఆర్థిక వృద్ధికి అంతంత మాత్రంగానే పనికొచ్చే అంశాలను తాను చేశానంటూ ప్రకటించడం పెద్ద జోక్ గా మారిపోయింది. పనికి రానివి ఎన్ని చేసి ఏం లాభం, ఎవరికి లాభమంటూ నిర్మోహటంగా ఆమెను ప్రశ్నించే అధికారం ఏపీ ప్రజలు, నేతలకు ఉంది. అదే టైంలో రాష్ట్రానికి ఇంత చేశానంటూ చేతులు దులుపుకుని సైలెంట్ అయిపోవటం మంచిదికాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కనీసం వెంకయ్య తరహాలో అయినా ప్రజలకు ధైర్యం చెబుతూ ఉండి ఉంటే ప్రస్తుతం ఇన్ని విమర్శలు వచ్చేవి కావేమోనని, అది గుర్తించి ఇప్పటికైనా అసలు వాటికోసం పోరాడితే సొంత ప్రజల్లో వ్యతిరేకత తగ్గుతుందని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nirmala Sitharaman  commerce minister  karnataka RS  AP development  

Other Articles