Magunta Gopinath facing TRS Troubles

Magunta gopinath facing trs troubles

Talangan, TDP, Telugudesamparty, Magunta Gopinath, Cash for Vote Case

TDP Greater Hyderabad President Magunta Gopinath facing troubles behalf of Cash for Vote case

మాగుంట గోపీనాధ్ కు టీఆర్ఎస్ కష్టాలు..?

Posted: 02/13/2016 11:43 AM IST
Magunta gopinath facing trs troubles

తెలుగుదేశం పార్టీలో కలకలం రేగుతోంది. ఉన్న ఎమ్మెల్యేలే తక్కువ అనుకుంటే ఉన్న వాళ్లు కూడా పార్టీని వీడుతున్నారు. అయితే టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు టీడిపి నాయకులకు ఆఫర్లు ఇస్తున్నారని.. అలా ఆఫర్లకు లొంగనిపక్షంలో కేసుల పేరుతో బెదిరింపులకు దిగుతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తీవ్ర తలనొప్పిని తెచ్చిన ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా మరోసారి ఈ ఓటుకు నోటుకు తెర మీదకు తీసుకువచ్చింది.  కేసు విచారణకు హాజరుకావాలని జెరూసలేం మత్తయ్యకు తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఇక ఓటుకు నోటు కేసు విషయానికి వస్తే గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్సన్  కొనుగోలు చేస్తూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసింది. ఈ కేసులో టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మరోవైపు కొనుగోలు విషయంలో సీఎం చంద్రబాబు, జూబిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పాత్ర ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ రాజధాని శంకుస్థాపనకు రావడంతో ఆకేసు మరుగున పడినట్లే అనుకున్నారు. కానీ  తాజాగా మళ్లీ ఈ కేసు తెరపైకి వచ్చింది. గ్రేటర్ ఎన్నికల తర్వాత నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ టీఆర్ఎస్‌లో చేరిన నేపథ్యంలో, మరో ఇద్దరినీ తమ పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ యత్నిస్తోందన్న ప్రచారం మీడియాలో సాగుతోంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను కూడా టీఆర్ఎస్ పార్టీలోకి ఆకర్షించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఓటుకు నోటు కేసును మళ్లీ తెరపైకి తెచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. స్టీఫెన్సన్‌కు రేవంత్ రెడ్డి అందజేసిన నగదును గోపీనాథే సమకూర్చారని, ఈ క్రమంలో ఆయన అరెస్ట్ తప్పదన్న ప్రచారం సాగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Talangan  TDP  Telugudesamparty  Magunta Gopinath  Cash for Vote Case  

Other Articles