BJP Party didn't get power even didn't increase vote bank

Bjp party didn t get power even didn t increase vote bank

Telangana, BJP, Elections, TDP, BJP in Telangana, Telangana BJP news

In The elections BJP party contesting but the party candidate getting expected seats.

తెలంగాణలో ఆ పువ్వు ఎప్పుడు పూస్తుందో..?

Posted: 08/17/2015 03:58 PM IST
Bjp party didn t get power even didn t increase vote bank

కేంద్రంలో ఫుల్‌ మెజార్టీ సాధించిన బీజేపీ... తెలంగాణలో అంచనాలను కూడా అందుకోలేకపోయింది.  తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అంటూ టీ బీజేపీ నేతలు తొడలుగొట్టారే తప్ప సార్వత్రిక ఎన్నికల్లో అంత సీన్లేదని తేలిపోయింది. టీడీపీ-బీజేపీ పొత్తు తెలంగాణలో పెద్దగా వర్కవుట్‌ కాకపోయినా గ్రేటర్‌లో గౌరవప్రదమైన స్థానాలే దక్కాయి. బీజేపీ  ఐదు ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఒక ఎంపీని గెలిపించుకుంది. కానీ మిగతా తెలంగాణ జిల్లాల్లో జెండా ఎగరేయలేకపోయింది.

సాధారణంగా ఏ ప్రతిపక్ష పార్టీ  ఆందోళన చేసినా మిగతా పార్టీలు మద్దతివ్వడమో, సంఘీభావం తెలపడమో చూస్తుంటాం. కానీ బీజేపీ ఈ విషయాన్ని పూర్తిగా  మర్చిపోయినట్టుంది. ఏ పార్టీతోనూ కలవటంలేదు. ఎవరినీ కలుపుకుని పోవడంలేదు. మాది ఒంటరి పోరాటం అన్నట్లే ఏకాకిలా ఉండిపోతోంది.  కనీసం మిత్రపక్షమైన టీడీపీతోనూ కలవట్లేదన్న చర్చ జరుగుతోంది.ఇలా ప్రతిపక్ష పార్టీలతో బీజేపీ కలవకపోవడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. ప్రజా  సమస్యలపై జరుగుతున్న పోరాటాల్లో వామపక్ష పార్టీల హవా ఎక్కువ కనిపిస్తోందని బీజేపీ నేతలు అనుకుంటున్నారట. సైద్ధాంతిక  విభేదాలున్న వామపక్షాలతో ఎలా కలిసి పనిచేస్తామనేది కాషాయ నేతల వాదన.

బీజేపీ ఎవరితో కలవకపోవడానికి మరో కారణం కూడా ఉందట... ఎవరో నిర్వహించే ధర్నాలో పాల్గొంటే... ఆ కార్యక్రమం సక్సెస్‌ అయితే క్రెడిట్‌ వారికి వెళ్తుంది తప్ప తమకు  రాదనే ఆలోచనతో ఉన్నారట బీజేపీ నేతలు. మాకు పార్టీ ఉంది... కేడర్‌ ఉంది... మా సిద్ధాంతాలు మాకున్నాయి... ఆ మాత్రం  ధర్నాలు, పోరాటాలు మేం చేసుకోలేమా అని బీజేపీ నేతలు అనుకుంటున్నారట. ఒకవేళ తాము చేసే ధర్నాకు వేరే పార్టీ నేతల్ని  పిలిచినా... ఆ క్రెడిట్‌ వాళ్లకు పోతుందేమో అన్న భయం కూడా ఉందట బీజేపీ నేతల్లో. ఏదైనా చేస్తే మేమే చేస్తాం... మమ్మల్ని  ఎవరూ శాసించాల్సిన, ఆదేశించాల్సిన అవసరం లేదని టీ-బీజేపీ పెద్దలు భావిస్తున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  BJP  Elections  TDP  BJP in Telangana  Telangana BJP news  

Other Articles