Telangana cabinet may expand after the GHMC elections

Telangana cabinet may expand after the ghmc elections

Telangana, Cabinet, Ministry, KCR, GHMC, Eletions

Telangana cabinet may expand after the GHMC elections. TRS party president and Telangana cm KCR gave instructions to party leaders to concentrate on GHMC elections.

జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత మంత్రి వర్గ విస్తరణ..!?

Posted: 07/29/2015 07:23 PM IST
Telangana cabinet may expand after the ghmc elections

మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ గ్రేటర్‌ హైద రాబాద్‌ ఎన్నికల తర్వాతే ఉంటుందని సమాచారం. డిసెంబర్‌లోగా గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైకోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే. దీనిప్రకారం నవంబర్‌ లో ఎన్నికల షెడ్యూల్‌ రానుంది. హైదరాబాద్‌ ఓటర్ల జాబితా కూడా సిద్ధమవుతోంది. అయితే జులై నెలలో కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ ఉంటుందని గతంలో అధికార టిఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల సమయంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేపడితే పార్టీలో లేనిపోని అసంతృప్తులు పెరిగే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్‌ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణకు వెనకడుగు వేసినట్లు సమాచారం.

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ గెలిస్తే మేయర్‌గా తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ నియమితులయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే తలసాని స్థానంలో మంత్రివర్గంలో డి.శ్రీనివాస్‌ ను తీసుకుంటారని కూడా పార్టీలో ప్రచారం జరుగుతోంది. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, డి.శ్రీనివాస్‌ల విషయంలో రోజుకోప్రచారం జరుగుతోంది. ఒక పార్టీ తరపున గెలిచిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు మంత్రిపదవినిఏ రకంగా కట్టబెడతారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.మరో పక్క  పార్టీ ఫిరాయింపులపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. తలసాని రాజీనామా లేఖ అందలేదని అసెంబ్లీ వర్గాలు పేర్కొంటే, రాజీనామా లేఖ తనవద్దే ఉందని స్పీకర్‌ మధుసూదనాచారి చెప్పడంతో తలసాని రాజీనామాపై డ్రామా నడుస్తోంది. తలసాని రాజీనామాపై స్పీకర్‌ ఏమి చేస్తారనేది సస్పెన్స్‌ నెలకొంది. తలసాని అంశాన్ని తనకు వదిలేయాలని ఇదివరకే ముఖ్యమంత్రి కెసిఆర్‌ స్పీకర్‌కు చెప్పినట్లు తెలిసింది. తలసానికి అండగా నిలబడాలనేది ముఖ్యమంత్రి నిర్ణయంగా ఉంది. ఈ విషయంలో ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలని కెసిఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆగస్టు చివరివారంలో లేదా సెప్టెంబర్‌ మొదటివారంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి.

మరి కేసీఆర్ తాజాగా పాత కేబినెట్ లోని ఇద్దరు మంత్రులకు పదవీ గండం ఉందని నడుస్తున్న ప్రచారానికి పార్టీలో వత్తిళ్లు కూడా పెరిగిపోయాయి. టిఆర్ఎస్ పార్టీకి ఎంతో కాలంగా సేవ చేస్తున్న తమను కాదని ఎవరెవరికో మంత్రి పదవులు కట్టబెట్టారని చాలా మంది అసంతృప్తులు ఇప్పటికే అధినేత ముందు అక్కసువెళ్లగక్కుతున్నారు. కాగా ఎన్నికల నేపథ్యంలొ మంత్రి వర్గ విస్తరణ మీద దృష్టిసారించకపోవడమే మంచిది అన్న అభిప్రాయానికి వచ్చిన కేసీఆర్ ఆ మేరకు పార్టీ వర్గాలకు సంకేతాలు కూడా పంపినట్లు సమాచారం. మంత్రి వర్గ విస్తరణ కన్నా ముందు ఎన్నికల మీద దృష్టిసారించి ఎలాగైనా పార్టీని గెలుపించాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతోంది.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Cabinet  Ministry  KCR  GHMC  Eletions  

Other Articles