D.Srinivas may join TRS

D srinivas to join trs soon

D.Srinivas may join TRS, d.srinivas, keshava rao, sonia gandhi, rahul gandhi, YS Rajashekar reddy, congress, TRS, Former PCC President DS, ex-minister D Srinivas, Latest News, News from Andhra Pradesh, Telugu News, Hyderabad News, India News

Former PCC President and ex-minister D Srinivas is most likely to join the Telangana Rashtra Samithi soon

కాంగ్రెస్ పై అలక.. కారుతో జత కడతా..!

Posted: 06/30/2015 08:36 PM IST
D srinivas to join trs soon

తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ టీఆర్‌ఎస్‌‌ దిశగా అడుగులు వేస్తున్నారు. టీఆర్ఎస్ సీనియర్ నేత కేకేతో డీఎస్ మంతనాల నేపథ్యంలో ఈయన కారెక్కడం ఖాయమని తెలుస్తోంది. కాంగ్రెస్‌ హైకమాండ్‌పై కొంతకాలంగా అసంత‌ృప్తితో ఉన్నడీఎస్, మరోమారు ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే డీఎస్ టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు తెలిసింది. త్వరలోనే కేసీఆర్‌ సమక్షంలో డీఎస్ టీఆర్‌ఎస్‌లో చేరతారని  ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమ పార్టీలో చేరేందుకు డీఎస్‌కు పలు ఆఫర్లను కూడా టీఆర్ఎస్ ప్రకటించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవిని ఆయనకు కట్టబెట్టే యోచనలో టీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
 
అయితే ఈ విషయంపై స్పందించిన డీఎస్ టీఆర్ఎస్‌లో చేరికపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కాంగ్రెస్‌పై అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. తన పదవీకాలం ముగిసి నెలరోజులైనా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దిగ్విజయ్ సింగ్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, తనని ఢిల్లీ రమ్మని కూడా ఎవరూ పిలవలేదని, కనీసం సోనియా కూడా పలకరించలేదని వాపోయారు. డీఎస్ కాంగ్రెస్‌ను వీడడం పక్కా అయితే, నిన్న ఆంధ్రలో.. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌కు కోలుకోని దెబ్బ తగిలినట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో మాజీ పీసీసీ చీఫ్ అయిన బొత్స సత్యనారాయణ కూడా ఇటీవలే వైసీపీ గూటికి చేరిన విషయం తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : d.srinivas  keshava rao  sonia gandhi  congress  TRS  

Other Articles