Are Tdp leaders honest..? if so how can they continue in TDP

How tdp leaders are continuing in the party

cash for vote, Revanth reddy, chandrababu, TDP, MLA's and MLC's, ACB, cherlapally, chanchalguda jail, Telangana TDP Mla, nominated mla stephen, anglo-indian stephen, Telangana government, TDP leaders,

After Telangana Tdp mla Revanth Reddy cash for vote episode, how come TDP mla's and mlc's continuing in TDP even after revealing boss chandrababu's name

తమ్ముళ్లు... మీకు నీతి, నిజాయితీ వుందా..?

Posted: 06/02/2015 09:06 PM IST
How tdp leaders are continuing in the party

తమ్ముళ్లు.. మీకు నిజాయితీ లేదా..? నీతిగా వుండాలని లేదా..? మీ తల్లిదండ్రులు నీతి నిజాయితీగా మిమ్మల్ని చదివించి.. ప్రయోజకుల్ని చేస్తే.. మీరు అవినీతి పార్టీలను అధికారంలోకి తీసుకోస్తారా..? మీకు కష్టపడే ప్రతి రూపాయిని దోచుకునే పార్టీలకు ఓటు వేస్తారా..? లేక నీతి, నిజాయితీకి కట్టుబడే పార్టీకి ఓటు వేస్తారా..? మీరే నిర్ణయించుకోండి అంటూ ఏడాదిన్నర క్రితం ఎన్నికల ప్రచారంలో.. ఊరూరా ప్రచారం చేసిన టీడీపీ అధినేత, నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను తాజా పరిణామాల నేపథ్యంలో ఊటంకించాల్సిన అవసరం ఏర్పడింది.

అవినీతి వ్యతిరేక భారత నిర్మాణ మహాద్యమాన్ని సాగించిన సామాజిక కార్యకర్త అన్నా హాజారేకు వారసుడిగా, ఆయన ఉద్యమ సమయంలో ప్రతిఫక్ష స్థానంలో కోనసాగిన చంద్రబాబు అనేక వ్యాఖ్యలు చేశారు. నీతి, నిజాయితీ తానే కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకోచ్చారు. మరో విధంగా చెప్పాలంటే తాను పుట్టిన తరువాతే.. నీతి, నిజాయితీలు పుట్టాయన్నట్లు వ్యవహరించారు. అప్పటికే అవినీతి మకిలి అంటిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోశారు. లారీలలో మీ డబ్బులను దోచుకెళ్లుతున్నారు. వందల లారీలలో ప్రజాధనాన్ని తీసుకెళ్లరని అరోపించారు.

అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఒక్క ఎమ్మెల్సీ స్థానం విజయం కోసం.. అవసరమైన మరో మూడు ఎమ్మెల్యే అభ్యర్థుల ఓట్లను సాధించే క్రమంలో నామినేటెడ్ ఎమ్మెల్యే ష్టీఫెన్ ఓటు కోనుగోలు కోసం ఐదు కోట్ల రూపాయల మేర భేరమాడిన రేవంత్ రెడ్డి ఘటనలో వీడియోను మనం చూశాం. బాస్ అంటూ రేవంత్ వల్లించిన పేరు.. ఆందుకు పుర్వాపరాలను పరిశీలించిన మీదట బాస్ మరెవరో కాదు చంద్రబాబనే అర్థమవుతోంది. ఈ తరుణంలో రేవంత్ ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీలో వున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా తెలుగు తమ్ముళ్లు తమ అధినేత చంద్రబాబు ప్రమేయం లేదని చెప్పగలరా..? అసలు ఈ అంశంపై భేటీలు పెడితే.. గతాన్ని తోవ్వడం.. లేదా బిక్కముఖం వేసుకోవడం తప్ప మరేం చేయగలరు..?

కాగా, చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలును గుర్తుచేసుకుని.. పార్టీలో ఎలా మనగలుగుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలమని, మేము మేం నేరం చేశామని..? తమను తాము (సమర్థించుకోవడం) డిఫెన్స్ చేసుకోవడం మినహా.. మరేం చెయగలరు. నీతి, నిజాయితీలకు కేరాఫ్ అడ్రస్ గా ఇన్నాళ్లు తమ పార్టీ వుందని చెప్పుకున్న ఆ పార్టీ ప్రజాప్రతినిధులు.. తాజా పరిణామాల నేపథ్యంలో జనంలో ఎలా తిరగగలరు..? ఈ నేపథ్యంలో పలువురు తెలుగు తమ్ముళ్లు, ప్రజాప్రతినిదులతో సహా పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారు. తమకు నీతి, నిజాయితీ వుందని, ఎవరో చేసిన తప్పుకు తమను కూడా నిందించడం సరికాదని, అసలు పార్టీలో ఎందుకున్నామన్న భావం కలుగుతుందని పలువురు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cash for vote  Revanth reddy  chandrababu  TDP  MLA's and MLC's  

Other Articles