ap government and police killed labour in fake encounter clears phone calls list

Labour call list clears that encounter is preplanned murder

redsandal smugglers, ap encounter, sheshachalam encounter, tamil organisations, preplanned killing, fake encounter, labour, 20 died, NHRC, national human rights commission, 20 smugglers killed in encounter

cell phone calls of the deceased in sheshachalam encounter clears that andhrapradesh government and police killed labour in fake encounter

శేషాచలం ఎన్ కౌంటర్ నరమేధమేనా..?

Posted: 05/20/2015 06:23 PM IST
Labour call list clears that encounter is preplanned murder

శేషాచలం అడవుల్లో జరిగింది నరమేధమేనా..? లేక భూటకపు ఎన్ కౌంటరేనా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తమిళనాడుకు చెందిన ఎర్ర చందనం స్మగర్లను 20 మందిని ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టామని పోలీసులు చెబుతున్నా.. నిజాలు మాత్రం తద్విరుద్దంగా వున్నాయి. ఇరవై మంది తమిళ కూలీలను కాల్చిచంపిన ‘ఎన్‌కౌంటర్లు’ ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటర్లేనని.. వారందరినీ అంతకుముందే పోలీసులు అదుపులోకి తీసుకుని, అడవుల్లోకి తీసుకెళ్లి దారుణంగా కాల్చిచంపారని వాదనలు తెరపైకి వస్తున్నాయి.

ఇందుకు తాజా సాక్ష్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఏప్రిల్ 7వ తేదీ తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ పోలీసులు, అటవీ సిబ్బంది కాల్పుల్లో చనిపోయిన ఎర్రచందనం కూలీల సెల్‌ఫోన్లకు సంబంధించిన ఫోన్ కాల్స్ వివరాలు.. మృతుల్లో పలువురు ఆ ముందు రోజు రాత్రి వరకూ తమిళనాడు సరిహద్దుల్లో, తిరుపతి ప్రాంతంలోనే సంచరించినట్లు నిర్ధారిస్తున్నాయి. శేషాచలం ‘ఎన్‌కౌంటర్’లో మృతి చెందిన 20 మంది తమిళ కూలీల్లో ఎనిమిది మంది సెల్‌ఫోన్లు వినియోగించారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న తమిళనాడు పోలీసు అధికారులు.. ఆ 8 మంది సెల్‌ఫోన్ కాల్ డిటైల్స్ రికార్డ్ (సీడీఆర్) ఆధారంగా దర్యాప్తు చేసి, సాక్షులను విచారించి ఆ వివరాలను కేంద్ర మానవ హక్కుల సంఘానికి సమర్పించారు.

కాగా, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లు నరికి, దుంగలు తీసుకెళ్లేందుకు తమిళనాడు నుంచి భారీ సంఖ్యలో కూలీలు ఏప్రిల్ ఆరో తేదీ నాటికే అడవుల్లోకి వచ్చారని.. వారు భారీగా ఎర్రచందనం చెట్లు నరికి దుంగలు తీసుకెళ్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందదింది. దీంతో ఆరో తేదీ రాత్రే పోలీసులు, అటవీ సిబ్బందితో కూడిన రెండు బృందాలు కూంబింగ్ మొదలు పెట్టాయని... ఏడో తేదీ తెల్లవారుజామున ఎర్రచందనం చెట్లు నరికి ఆ దుంగలను మోసుకెళ్తున్న వంద మందికి పైగా స్మగ్లర్లు ఈ బృందాలకు తారసపడ్డారని మన రాష్ట్ర పోలీసులు చెప్పారు. వారిని లొంగిపోవాల్సిందిగా పోలీసులు హెచ్చరించగా.. వారు ‘మారణాయుధాల’తో పోలీసులపై దాడి చేశారు. పోలీసులు ఆత్మరక్షణార్థం ఎదురు కాల్పులు జరపగా.. రెండు చోట్ల 20 మంది స్మగ్లర్లు, కూలీలు చనిపోయారని చెప్పారు. అయితే ఈ కేసును విచారిస్తున్న జాతీయ మానవ హక్కుల కమీషన్.. త్వరలోనే నిజానిజాలను వెలుగులోకి తీసుకురానుంది.
 
జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles