Ap agricural minister pullarao get a phone calls every sec because of raithu runamafi

raithu runamfi in andhra pradesh, cm chandra babu naidu, minister pratthipati pullarao, pullarao, ap minister pullarao, ap minister pullarao phone number

andhra pradesh agricultural minister get phone calls and missed calls each and evry sec because of raithu runamafi scheme

వ్యవసాయశాఖా మంత్రి పుల్లారావును వేధిస్తున్న ఫోన్ ల సమస్య...!!

Posted: 12/18/2014 11:14 AM IST
Ap agricural minister pullarao get a phone calls every sec because of raithu runamafi

ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఫోన్ ఒక పెద్ద సమస్య గా పరిణమిస్తుందట..! దీనికి కారణం మరెవరో కాదు ఆంద్ర ప్రదేశ్ పి.సి.సి అధ్యక్షుడు రఘువీరా రెడ్డియే. ఇటీవల రుణమాఫీ అని ప్రకటించిన తర్వాత కొన్ని సభలు పెట్టినపుడు చంద్రబాబు నాయుడు పాల్గొన్న ప్రతి సభ రైతులతో మాట్లాడిస్తున్నారు. అప్పుడు మాట్లాడిన రైతు చంద్ర బాబు నిజంగా దేవుడని, మా బ్రతుకులు కాపాడటానికి వచ్చిన ఆపద్భాందవుడని, రైతులు పొగడటానికి తెగ అవస్థలు పడుతున్నారు. దీనికి, మంత్రి పుల్లారావు ఫోన్ సమస్య కి ఏంటన్నదే కదా సందేహం ఉంది అక్కడే ఉంది అసలు చిక్కంతా...!!

రైతులు పొగడటం బానే ఉంది.., చంద్ర బాబు పోగిదిన్చుకోవటం బానే ఉంది కానీ పుల్లారావు కు మాత్రం చిక్కొచ్చి పడింది. ఎలా అంటే రైతులందరిలో ఎవరికైనా రుణమాఫీ జరగకపోతే డైరెక్ట్ గ మంత్రి గారికే ఫోన్ చేయాలనీ, రునమఫిలో ఏదైనా సమస్య ఉన్నా, అసలు జరగకపోయినా వెంటనే మంత్రి పుల్లారావు కి ఫోన్ కొట్టాలని ప్రకటించి ఆ ఫోన్ నంబర్ కూడా ప్రకటించేసారు. ఇక గత మూడు రోజులుగా మంత్రి గారి ఫోన్ కి ఒకటే ఫోన్ లు వస్తున్నాయంట.. వాటికి సమాధానం చెప్తే ఒక సమస్య, చెప్పకపోతే మరో సమస్య అని తల పట్టుకుంటున్నారట మంత్రి గారు. ఒక కాల్ కు సమాధానం చెప్పేలోపే ఒక 10 కాల్స్ మిసుడ్ కాల్స్ గా పడుతున్నాయట.. ఈ విషయాన్నీ ఆయనే తన సన్నిహితుల వద్ద చెప్పి వాపోయారట. ఇదిలా ఉంటె రుణమాఫీ చేసిన చంద్ర బాబు ఒక వైపు కొన్ని ఊర్లలో టి.డి.పి కార్యకర్తలు పాలాభిషేకాలు, పండ్లాభిషేకాలు చేస్తుంటే మంత్రి పుల్లారావు పరిస్థితి ఇదంటా...!! ఆయనకేమో ఫోన్లు ఈయనేకేమో పాలాభిషేకలా అని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles