Chiranjeevi and ktr chatting with each other in celebrity parties

chiranjeevi, telangana it minister ktr, ktr latest news, chiranjeevi latest news, formet central minister chiranjeevi, megastar chiranjeevi, chiranjeevi ktr news, raghavendra rao son reception, subbirami reddy grandson engagement function

chiranjeevi and ktr chatting with each other in celebrity parties : tollywood megastar - former central minister chiranjeevi and ktr chatting with each other in raghavendra rao son reception and subbirami reddy grandson engagement party which goes viral in political way

చిరంజీవి టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవుతున్నారా!

Posted: 08/18/2014 03:31 PM IST
Chiranjeevi and ktr chatting with each other in celebrity parties

టాలీవుడ్ మెగాస్టార్ - మాజీ కేంద్రమంత్రి చిరంజీవి టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవుతున్నారా..? ప్రస్తుతం ఇటువంటి అనుమానాలే రాజకీయరంగంలోనూ, చిత్రపరిశ్రమలోనూ జోరుగా పుకార్లు సాగుతున్నాయి. గతంలో చిరంజీవి, టీఆర్ఎస్ అండ్ ఫ్యామిలీల మధ్య ఎన్ని వివాదాలు రేగాయో మనందరికీ తెలిసిందే! ఒకరిమీద ఇంకొకరు వాడివేడీగా దుమ్మెత్తిపోసుకుంటూ బాగానే తిట్టుకున్నారు. అప్పట్లో హైదరాబాద్ ను యూనియన్ టెరిటరీ చేయాలంటూ చిరంజీవి తన వాదనను వినిపిస్తే... దానికి టీఆర్ఎస్ పార్టీ సభ్యులు - ఆ పార్టీని నడిపే ఫ్యామిలీ మెంబర్స్ ఆయన్ను ఓ రేంజులో తిట్లవర్షం కురిపించారు. కొన్నాళ్లవరకు వాదోపవాదనలూ సాగాయి. ఇక రామ్ చరణ్ ‘‘జంజీర్’’ సినిమాను తెలంగాణాలో ఆడనివ్వమని టీఆర్ఎస్ కార్యకర్తలు హెచ్చరికలు జారీ చేయగా.. దానిని కోర్టు ఆర్డర్ తో పోలీసుల సహాయాన్ని తీసుకుని చివరికి తన సినిమాను రిలీజ్ చేయించుకున్నాడు! దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధం ఎప్పటికీ వుండదని అందరూ అనుకున్న తరుణంలో.. ఇప్పుడు పెద్ద షాకిచ్చేశారు. పొలిటికల్ స్ర్కీన్ పై నడిచిన డ్రామాలు, రియల్ లైఫ్ లో వుండవని వారు నిరూపించేశారు.

మొన్న జరిగిన కే.రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ రిసెప్షన్ పార్టీలో ఓ అరగంటపాటు చిరంజీవితో కలిసి తెలంగాణ ఐటీశాఖమంత్రి కేటీఆర్ ముచ్చట్లు చేస్తూ కనిపించారు. చిరును అప్యాయంగా ఆలింగనం చేసుకుని, ఇద్దరూ ఒకరిమీద ఒకరు జోకులు వేసుకుంటూ తెగనవ్వుకున్నారు. వీరిమధ్య ఆంధ్ర మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా చేరిపోయి నవ్వులు పూయించుకున్నారు. ఇక్కడితో అయిపోలేదు.. చరణ్ - ఉపాసనలు కూడా వీరి మధ్య చేరిపోయారు. మొదట చరణ్ కు ఒక హగ్ ఇచ్చుకున్న కేటీఆర్... అతనిమీద జోకులు వేస్తూ అతని భార్య ఉపాసనను కడుపుబ్బా నవ్వించేశాడు. ఇలా ఆ పార్టీలో ఆంధ్రమంత్రితోపాటు చిరు కుటుంబసభ్యులతో కలిసి ఈ యంగ్ తెలంగాణ మంత్రి కేటీఆర్ బాగానే చాటింగ్ చేస్తూ హుషారుగా కనిపించారు. ఇంతటితో వీరిమధ్య వున్న సఖ్యతకు తెరపడలేదు.. ఇంకా వుంది!

ప్రముఖ వ్యాపారవేత్త, ఎంపీ సుబ్బిరామిరెడ్డి మనవడి ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ లో కూడా మరోసారి చిరంజీవి - కేటీఆర్ లు పండగ చేసుకున్నారు. అక్కడ కూడా అవే జోకులు, నవ్వులు, కామెడీలు చేసుకుంటూ కెమెరాలకు చిక్కారు. గతంలో టీఆర్ఎస్ కార్యకర్తల చేతిలో బాగా తిట్టించుకున్న లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ కూడా వీరి గ్యాంగ్ లో చేరిపోయి, జోకులు వేసుకున్నారు. ఇదిలావుండగా.. కేటీఆర్ తో కలిసి చిరంజీవి అంత సఖ్యతగా మెలగడానికి కారణాలేముంటాయంటూ ఇఫ్పుడు అటు రాజకీయరంగంలో, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొంపదీసి చిరంజీవి టీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారా..? లేక రాజకీయంగా ఏవైనా సన్నాహాలు చేస్తున్నారా..? అంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే చిరంజీవికి కేటీఆర్ వీరాభిమాని కావడం వల్లే ఇలా కలిసి వుంటారని మరికొంతమంది చెప్పుకుంటున్నారు. రానురాను వీరి కలయిక ఇంకెన్ని అనుమానాలకు తావిస్తుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  telangana it minister ktr  chiranjeevi ktr  political parties  

Other Articles