Pawan kalyan should be responsible if crop loans are not waivered says roja

pawan kalyan roja, pawan kalyan should be responsible, crop-loans are not waivered says roja, ys jagan, ysrcp, mla roja, janasena party pawan, janasena pawan kalyan, tdp government, Chandrababu cm.

pawan kalyan should be responsible if crop-loans are not waivered says roja

పవన్ తో రోజా- ఒళ్లుమండిన జగన్?

Posted: 06/19/2014 10:41 AM IST
Pawan kalyan should be responsible if crop loans are not waivered says roja

పది సంవత్సరాలు రాజకీయల్లో ఆ పార్టీ జెండా కొద్ది సేపు, ఈ పార్టీ జెండా కొద్ది సేపు ..మోసి చివరకు జగన్ జెండా తో గెలిచిన సినిమా నటి, ఎమ్మెల్యే రోజా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై భారీ భారం పెట్టింది. అంటే మరోలా అనుకోకండి? ప్రశ్నించే పవన్ కళ్యాణ్ కోసం.. రోజా ఓపెన్ డోర్ తెరిచింది. మా పార్టీ ప్రతిపక్షంలో కూర్చున్న సీమాంద్ర బాధ్యత మొత్తం పవన్ కళ్యాణ్ దే అని చిలక పలుకులు పలుకుతుంది. అసలు విషయం ఏమిటంటే.. ఆంద్రప్రదేశ్ లో అధికారం వస్తుందని ఆడ, మగ తేడా లేకుండా ఆ పార్టీలోని నేతలు అందరు పగటి కలలు కన్నారు. కానీ ఆ పగటి కలలు నిజం కావని ..ఎన్నికల తరువాత వైసీపీ నేతలకు తెలిసింది. దీంతో వారు ప్రతిపక్షనేతలుగా మిగిలిపోయారు.

అయితే ఇప్పుడు జగన్ పార్టీ నుండి గెలిచిన రోజా, జనం సమస్యలను పవన్ కళ్యాణ్ పై రుద్దుతుంది. ప్రజా ఓట్లతో గెలిచిన రోజా, ప్రజా సమస్యలకు మాత్రం చాలా దూరంగా ఉంటుంది. అంటే దీనిని బట్టి రోజా పువ్వు కింద ముల్లు ఉన్నట్లే, ఈ ఎమ్మెల్యే రోజా కింద ..ప్రజా ముల్లు(సమస్యలు) లేదనే విషయం గెలిపించిన నియోజక వర్గ ప్రజలకు అర్థమైంది.

ఈరోజు మొదటి సారిగా అసెంబ్లీలో అడుగుపెడుతున్న రోజమ్మ, పవన్ కళ్యాణ్ ను తలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొలి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో ధీమాగా ఉన్న వైకాపా పార్టీని ఓటర్లు ప్రధాన ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు. అయితే ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో సహా పలువురు ఎంఎల్ఏలు జరుగబోయే అసెంబ్లీ సమావేశాలకు గాను మొదటి సారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.

pawan-kalyan-modi-roja

అందులో ఒకరు సినీనటి రోజా. ఈ సందర్బంగా రోజా మొదటి సారి అసెంబ్లీలో అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉందని. ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న మేము ప్రజల సమస్యల కోసం పోరాడుతామని అన్నారు. అయితే రైతు రుణమాఫీ విషయం గురించి రోజా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తరుపున ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ మరియు ‘జనసేన’ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లను చూసి ప్రజలు ఓట్లు వేసారని. ఇప్పుడు రైతు రుణమాఫి జరుగకపోతే దానికి పవన్ కళ్యాణ్ కూడా బాధ్యత వహించాలని రోజా అన్నారు.

రోజా మాట్లాడిన తీరును బట్టి చూస్తే.. జగన్ వల్ల ఏమీ కాదు. అంత పవన్ కళ్యాణ్ నే చూసుకొనే విధంగా రోజా మాట్లాడిందని రాజకీయ పండితులు అంటున్నారు. ప్రజలు మనకు ఓట్లు వేసి గెలిపిస్తే , . పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజా సమస్యలపై పోరాటం చెయ్యలా? ఏం.. రోజా ఇలా మాట్లాడుతున్నావని ఆ పార్టీలోని సినియర్ నాయకులు..ఆమె పై కొన్ని గులాబీ ముల్లు విసిరారు. దీంతో ఖంగుతిన్న రోజా వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఇలాంటి నాయకులతో మా పార్టీ పరువు పోతుందని పార్టీలోని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేసినట్లు మీడియా వర్గాలు అంటున్నారు.

jagan-pawan

అసెంబ్లీలో అడుగు పెట్టే ముందు కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేరును మీడియా ముందు  తలచుకుని సీమాంద్ర ప్రజల్లో పవన్ రేంజ్ ఇంకా పెంచినట్లు గా ఉందని ఆ పార్టీ కార్యకర్తలు రోజా పై  మండిపడుతున్నారు.  దీంతో జగన్ ఎంటరై.. కొంచెం  నోరు అదుపులో పెట్టుకొని మీడియా ముందు మాట్లాడండని      రోజా కు క్లాస్ పీకీనట్లు  రాజకీయ వర్గాలు అంటున్నాయి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles