Actor balakrishna vs hindupur contest people

actor Balakrishna, tdp balkrishna, Hindupur contest, Hindupur contest people, election 2014, telangana balakrishna, tdp leaders, balakrishna election camp, chandrababu naidu.

actor Balakrishna vs Hindupur contest people

తెలంగాణ బాలయ్యకు ఓటు వేయలేం?

Posted: 04/21/2014 05:40 PM IST
Actor balakrishna vs hindupur contest people

టిడిపి తరుపున  హిందూపురం నియోజక వర్గం నుండి ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న నటుడు బాలయ్య కు చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటి వరకు  ఇలాంటి  అనుభవం ఏ రాజకీయ నాయకుడికి కాలేదు.  మొట్ట మొదటిసారిగా   బాలయ్యకు జరగటంతో ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు ఆశ్చర్యపోతున్నారు. 

హిందూపురం నియోజకవర్గం ప్రజలు   బాలయ్యకు  ఓటు వేయటానికి వెనకడుగు వేస్తున్నారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటున్నారు. అసలు కారణం ఏమిటంటే.. బాలయ్య ఆ ప్రాంతీయుడు కాకపోవడంతో ప్రజలు ఓట్లు వేయడానికి సందేహిస్తున్నారని, అదే ప్రధాన కారణమని విశ్వసనీయవర్గాల సమాచారం.

బాలయ్య నామినేషన్ దాఖలు చేసిన పిదప రెండురోజులు సొంత నియోజకవర్గంలో ప్రచారం చేసి తర్వాత ఇతర జిల్లాల్లో పర్యటనకు వెళ్ళిపోయారు. కాగా ప్రజలలోకి వెళ్లి పార్టీ ప్రచారాలను బలోపేతం చెయ్యాల్సిన భాద్యత స్థానిక నేతలపై పడింది. 

అయితే ఓట్లు అడగడానికి వెళ్ళిన సదరు నేతలతో ప్రజలు ‘మాకు కష్టాలు వస్తే హైదరాబాద్ వెళ్లి బాలయ్యతో చెప్పుకోవాలా? ఆయన ఇక్కడ ఉంటాడా? మీకే ఆయనను కలిసే దిక్కులేదు ఇక మా సమస్యలెవరు తీరుస్తారు’ అంటూ దుయ్యబడుతున్నారని పార్టీ  కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. గతంలో లేని విధంగా స్థానికేతరులకు పట్టం కట్టబోమని ప్రజలు తెగేసి చెబుతున్నారని వినికిడి. 

అంతేకాకుండా బాలయ్య అఫిడవిట్ లో చిరునామా హైదరాబాద్ అని పేర్కొనడంతో హిందూపురం ప్రజలు బాలయ్యని తెలంగాణ వ్యక్తిగానే చూస్తున్నారు. తాము సమస్యలు పరిష్కరిస్తామని సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ, మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు, అంబికా లక్ష్మినారాయణ హామీ ఇస్తున్నా ప్రజలు మాత్రం పట్టించుకోవట్లేదట. 

దీంతో తెలుగు తమ్ముళ్ళకు దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. ఈ పరిస్థితులు చూస్తుంటే హిందూపూర్ లో బాలయ్య ప్రజల విశ్వాసాన్ని పొంది ఎంతవరకు విజయం సాధించగలడోనని అనుమానం కలుగక మానదు. ఏది ఏమైనా ఫలితాలు వెలువడితేగానీ బాలయ్య రాజకీయ చరిత్ర తెలిసిపోతుందని  పార్టీ కార్యకర్తలు అంటున్నారు. 

 

ఆర్ఎస్  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles