సికింద్రాబాద్ గన్ రాక్ ఫంక్షన్ హాల్లో శనివారం వోటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నంలో సెల్ ఫోన్లు, కుక్కర్లు, మైక్రో ఒవెన్లు మొదలైన వస్తువులను పంపిణీ చేస్తున్న మెదక్ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విషయం తెలిసి అక్కడికి పోలీసులతో చేరుకున్న స్టాటిక్ సర్వెలెన్స్ బృందం చేరుకోవటం చూసి ఫంక్షన్ హాల్ గోడ దూకి పారిపోయారు. ఆ దృశ్యం అక్కిడ సన్నివేశాన్నంతా పోలీసులు చేసిన వీడియో రికార్డింగ్ లో నిక్షిప్తమైంది.
రంగారెడ్డి జిల్లాలోని ఒక ఎమ్మెల్యేకి చెందిన ఆ ఫంక్షన్ హాల్లో భారీ సంఖ్యలో పంపిణికీ పెట్టిన వస్తువులు ఇవి- సెల్ ఫోన్లు, మిక్సీలు, కుక్కర్లు, డివిడి ప్లేయర్లు, గ్యాస్ స్టౌలు, వంట సామగ్రి మొదలైనవి. ఎక్కడివాళ్ళక్కడ పారిపోతుండగా ఒక మహిళతో సహా ముగ్గురు పోలీసులకు చిక్కారు. అక్కడ మిగిలివున్న 80 సెల్ ఫోన్లు, కుక్కర్లు, మిక్సీలు మొదలైన వస్తువులతో పాటు మద్యం సీసాలను కూడా కంటోన్మెంట్ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిణి లక్ష్మి సారధ్యంలో దాడికి వచ్చిన పోలీసులు స్ఫాధీనం చేసుకున్నారు.
ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింది కేసు నమోదు చెయ్యటం జరుగుతుందని, అసలు ఆ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న కార్యక్రమానికి అనుమతి విషయంలో కూడా దర్యాప్తు జరుగుతుందని లక్ష్మి అన్నారు.
ఆ ఫంక్షన్ హాల్లో సంగారెడ్డి నియోజక వర్గంలోని వోటర్ల సమక్షంలో జరపదలచుకున్న ఆ పంపిణీ కార్యక్రమం సంగారెడ్డి మహిళా నాయకురాలు నెక్కంటి స్వరూప పుట్టినరోజు వేడుకగా చూపించదలచుకున్నారు. కానీ పోలీసులు దాడికి రావటంతో వోటర్లు నాయకులు ఎక్కడికక్కడ పిక్క బలం చూపించి అక్కడి నుండి పారిపోయారు.
ఇదే జగ్గారెడ్డిని పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో తనకి ఇష్టమైన నాయుకుడిగా పొగిడారు. దానికి స్పందించిన జగ్గారెడ్డి అప్పట్లో, తను పవన్ కళ్యాణ్ ని కలవలేదని, అయితే ఆయన తెరాస గురించి చెప్పిందంతా నూటికి నూరు శాతం నిజమని మీడియాలో ప్రకటించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more