Both the parties should be hanged in rape sp leader abu azmi

Both should be hanged in rape says Abu Azmi, Samajwadi party leader Abu Azmi, Samajwadi party President Mulayam Singh Yadav

Both the parties should be hanged in rape- SP leader Abu Azmi

రేప్ లో ఇద్దర్నీ శిక్షించాలి- సమాజ్ వాదీ పార్టీ నేత అబు అజ్మి

Posted: 04/11/2014 01:54 PM IST
Both the parties should be hanged in rape sp leader abu azmi

సమాజ్ వాదీ పార్టీ నుంచి మరో షాకిచ్చే వ్యాఖ్యానం చేసారు ఆ పార్టీ ముఖ్య నేత అబు అజ్మి. 

ఆ పార్టీ సంస్థాపకుడు ములాయమ్ సింగ్ యాదవ్, చిన్న పిల్లలు తప్పు చేస్తారు మరి, ఆ మాత్రానికి వాళ్ళని ఉరితీస్తారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తే అది ఇంకా సమసిపోనేలేదు, అదే పార్టీ నాయకుడు అబు అజ్మి మరింత సంచలనాన్ని సృష్టించారు. 

ఆయన మాటల్లో, ఇస్లామ్ లో రేప్ కి శిక్ష ఉరి.  కానీ ఆడవాళ్ళ విషయంలో ఇక్కడేమీ జరగదు.  కేవలం మగవాళ్ళకే శిక్షలు పడుతుంటాయి.  కానీ ఆడవాళ్ళు కూడా శిక్షార్హులే.  భారతదేశంలో ఆడవాళ్ళ అంగీకారంతో చేసిన శృంగారానికి శిక్షేమీ లేదు.  అదే, వాళ్ళు ఫిర్యాదు చేస్తే మాత్రం నేరమే.  ఆడపిల్లలు వాళ్ళనెవరైనా ముట్టుకుంటే ఫిర్యాదు చెయ్యవచ్చు, ముట్టుకోకపోయినా సరే.  మగవాడు పతనమైపోతున్నాడు.  రేప్ అనేది ఇష్టపూర్వకంగా జరిగినా లేక ఇష్టం లేకుండా జరిగినా సరే అది ఇస్లాం ప్రకారం శిక్షార్హమే. 

అందుకు మార్గాంతరమేమిటని అడగ్గా, ఒక ఆడది వివాహితైనా అవివాహితైనా సరే,  పర పురుషుడితో ఇష్టపూర్వకంగా కానీ లేదా ఇష్టం లేకుండా శృంగారంలో పాల్గొన్నా సరే ఇద్దర్నీ ఉరితీయాలి.  అంతేకానీ ఆడది ఇష్టపూర్వకంగా తప్పు చేస్తే దాన్ని సమర్థించగూడదు. 

కానీ అబు అజ్మి మాటలను ఆయన కుమారుడు ఖండించాడు.   నాకు ఐదుగురు అక్క చెల్లెళ్ళున్నారు.  మా కుటంబమంతా రేప్ ని ఖండిస్తుంది.  రేప్ చేసిన వాళ్ళని ఒకసారి కాదు వందసార్లు ఉరితియ్యాలన్నాడతను. 

అయితే అబు అజ్మి మాటలు ములాయమ్ సింగ్ వ్యాఖ్యలను సమర్థించటంలేదు.  ఎందుకంటే, పిల్లలు పిల్లలే, తప్పు చేస్తారు మరి అన్న ములాయమ్ సింగ్ మాటల మీద తన వ్యాఖ్యను ఆయన దాటవేసారు. 

బలాత్కారం, శృంగారం విషయంలో అబు అజ్మి మొదట్లో కాస్త తడబడ్డారు కానీ చివరకు స్పష్టత వచ్చినట్లుంది.

ఇక్కడ శృంగారం గురించి కాదు రేప్ గురించి కదా మాట్లాడుతున్నాం అని గుర్తు చేస్తే, ఇస్లాంలో రేప్ చేసినవారికి మృత్యు దండనే ఉంది.  కానీ అత్యాచారంలో ఆడది అబలే కదా అలాంటప్పుడు ఆమెకు శిక్ష ఉండగూడదంటూ మాట మార్చారాయన.  ఇద్దరు హోటల్ కి వెళ్ళి ఇష్టపూర్వకంగానే సెక్స్ లో పాల్గొన్నా సరే వాళ్ళిద్దరినీ ఉరితియ్యాలన్నారు అబు అజ్మి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles