Define aam admi asks amartya sen

Define Aam Admi asks Amartya Sen, Nobel laureate Amartya Sen, Aam Admi Party, Arvind Kejriwal, AAP Yogendra Yadav

Define Aam Admi asks Nobel laureate Amartya Sen

ఆమ్ ఆద్మీకి నిర్వచనం విస్తృత పరిధిలో ఉండాలి- అమర్త్య సేన్

Posted: 02/23/2014 10:13 AM IST
Define aam admi asks amartya sen

నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ ఆమ్ ఆద్మీ అవలంబించిన రాజకీయ విధానాలను పొగుడుతూనే ఆమ్ ఆద్మీ అనేదానికి అర్థం ఇంకా విస్తృతమైన పరిధిలో ఉంటే బాగుంటుందని, దాని గురించి ఆలోచన చెయ్యమని అరవింద్ కేజ్రీవాల్ ని కోరారు.

మిగతా రాజకీయ పార్టీలలా కాకుండా కుల మత ప్రాంతీయ విభేదాలకు తావివ్వకుండా రాజకీయ వ్యూహరచన చేసి ఢిల్లీ గద్దెను సంపాదించిన ఆఆపా కి ప్రణామం అని అన్న అమర్త్య సేన్, సమాన హక్కుల గురించి పోరాడే విధానంలో ఆ పదానికి అర్థం కాస్త వికృతీకరించబడిందని అభిప్రాయాన్ని కూడా తెలియజేసారు.  ఆమ్ ఆద్మీ అంటే ఎవరు, దాని అర్థం మారుతూ పోతుందా అని అడిగారాయన. 

ఒకవేళ నిరుపేదల తరఫునే పోరాడుతున్నట్లయితే కరెంట్ బిల్లులో వసూలు చేసే ఛార్జీల గురించి మాట్లాడకండి ఎందుకంటే నిరుపేదలకు అసలు కరెంట్ కనెక్షనే లేదు.  ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న యోగంద్ర యాదవ్ లాంటి వాళ్ళు తనకు తెలుసని, వాళ్ళు తప్పక ఆలోచిస్తారని తనకు నమ్మకముందని అన్న అమర్త్య సేన్ సామాజిక సమ న్యాయం, పేదల తరఫున పోరాటం చెయ్యటానికి కంకణం కట్టుకున్న ఆఆపా వాటిని సరిగ్గా నిర్ధారించుకోవాలని, కేవలం ఢిల్లీలో సాధించిన విధానంలోనే పోతే సరిపోదని అన్నారు. 

ఇంకా ఆఆపా ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి, వాళ్ళని వాళ్ళు స్వయం పరిశీలన ద్వారా తెలుసుకుంటారని, పార్టీ సిద్ధాంతాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తూ వారి లక్ష్యసాధనలో ఆ పార్టీకి విజయం చేకూరాలని తన ఆకాంక్షను కూడా అమర్త్య సేన్ తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles