Cm n kiran to resign

cm N Kiran to Resign, cm kiran kumar reddy, cm kiran resign, Seemandhra Leaders, cabinet bill, telangana bill, congress party, 2014 election.

CM N Kiran to Resign, CM Kiran Kumar Reddy ready to Resign

రాజీనామాకు సై అంటున్న సిఎం కిరణ్ ?

Posted: 02/07/2014 03:42 PM IST
Cm n kiran to resign

రాజ్యసభ ఎన్నికల తరువాత.. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పై  కాంగ్రెస్ అధిష్టానం వేటు వేస్తుందని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుసగుసలాడుతున్నారు. అయితే కాంగ్రెస్ నాయకులతో పాటు.. మీడియాలో   ఈ న్యూస్ హాట్ టాపిక్ మారింది. అయితే సిఎం కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం  అధిష్టానం వేటు వేసే వరకు ఎదురుచూడకుండానే.. రాజీనామాకు సై అంటున్నట్లు..  కాంగ్రెస్ నాయకుల మద్య పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి.   కాంగ్రెస్ పార్టీ అధిష్టానం .. తీసుకున్న నిర్ణయం వ్యతిరేకంగా  రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజనలో భాగం కాదల్చుకోలేక ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు ఉదయం జూబ్లీ హాల్ లో సీమాంధ్ర ప్రజాప్రతినిధులతో సీఎం కిరణ్ భేటీ అయి సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో  రాజీనామా అంశాన్ని సీఎం కిరన్ కుమార్ రెడ్డి చెప్పినట్లు సీమాంద్ర నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారం వెనుకు ముఖ్య ఉద్దేశం ఏమిటనేది ఎవరికి అర్థం కావటంలేదని.. కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు.  తనపై వేటు వేసే అవకాశం ఎవరికీ ఇవ్వనని సీఎం కిరణ్ వారితో పేర్కొన్నట్లు సమాచారం. అయితే దీని గురించి ఈరోజ  సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా అంశాన్ని ప్రకటిస్తారని సీమాంధ్ర నేతలు అంటున్నారు. 

అసెంబ్లీ వేదికగా సమైక్యగళాన్ని వినిపించిన కిరణ్‌ తిరస్కరణ నోటీసుతో బ్రహ్మస్త్రాన్ని సంధించారు. ఇదంతా రాష్ట్రానికే పరిమితం కావడంతో అధిష్టానం ఒక్కమాట మాట్లాడలేదని సమాచారం. ఇన్నాళ్లు ప్రెస్‌మీట్‌లు.. మీటింగ్‌లకే పరిమితమైన సీఎం కిరణ్ దూకుడు మరింత పెంచారు. మౌనదీక్ష పేరుతో ఏకంగా ఢిల్లీని ఢీ కొట్టేందుకు సిద్దపడిన విషయం తెలిసిందే. అయితే దేశరాజధాని సాక్షిగా హస్తిన వీధుల్లో సమైక్యస్వరాన్ని వినిపించారు. రాష్ట్రాన్ని విభజించకూడదంటూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి విన్నపించారు. సమైక్యం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమంటూ వ్యాఖ్యలు చేశారు. కిరణ్‌ వ్యవహారాన్ని పట్టించుకోని అధిష్టానం ఇప్పుడు సీఎంపై దృష్టిసారించిందని, ఢిల్లీలో దీక్ష చేయడం హైకమాండ్‌కు మింగుడుపడడం లేదని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.  

ఇదిలా ఉంటే ఢిల్లీ నాయకత్వమే సీఎం కిరణ్ ను ప్రోత్సాహిస్తోందని బిజెపి నాయకులు గోల చేస్తున్నారు. దీనికి తోడు  తెలంగాణ  కాంగ్రెస్ నేతలు కూడా మద్దతు పలుకుతున్నారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న కిరణ్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెలంగాణ  కాంగ్రెస్ నేతలు  కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని వత్తిడి తెస్తున్నట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు.  దీంతో  విసిగిపోయిన  అధిష్టానం  నల్లారి పై వేటు వేయటానికి సిద్దమైన్నట్లు  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  అంటున్నారు.  అయితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం   కాంగ్రెస్ పార్టీకే  షాకిచ్చేందుకు రెఢీ అవుతున్నట్లు  సీమాంద్ర కాంగ్రెస్ నేతలు .. గుసగుసలాడుకుంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్ఠానం వేటు వేస్తుందా?' లేక... 'మీరు తప్పించేదేంటి! నేనే తప్పుకొంటా?' అంటూ పార్టీకి కిరణ్ మరో షాక్ ఇస్తారా? వీటిల్లో ఏది ముందు జరుగుతుందో  వేచి చూద్దాం. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles