Traffic cases on us diplomats

Traffic cases on US diplomats, Devyani Khoragade, Traffic challans for diplomats, India reciprocates US action against Devyanai

Traffic cases on US diplomats

యుఎస్, మరి కాచుకో

Posted: 01/08/2014 02:54 PM IST
Traffic cases on us diplomats

పూర్వకాలం యుద్ధభూమిలో శత్రుసేనలను యుద్దానికి పిలిచి కాచుకో మని చెప్పి మరీ బాణాలు సంధించేవారని మనం పుస్తకాలు పురణాల్లో చూస్తాం.  అంతే కాని వాళ్ళకి చెప్పకుండా అదాటున ప్రహారం చెయ్యటం యుద్ధనీతిని అతిక్రమించినట్లుగా భావించేవారు.  ధర్మ యుద్ధమే తప్ప మరేమీ తెలియని మన దేశవాసులలో ఈ అలవాటు ఇంకా పోలేదు. 

అమెరికా ప్రభుత్వం చేసినట్లుగా ఇతర దేశాల మీద డ్రోన్ ప్రయోగాలు, ఇంటర్ నెట్ ద్వారా ఇతర దేశస్తుల వ్యక్తిగత సమాచారాలను రహస్యంగా సంగ్రహించటం లాంటి వాటి జోలికి పోవటమనేది మన దేశ ప్రభుత్వాలు ఎప్పుడూ చెయ్యవు సరికదా, నేరస్తులకు కావలసినంత సమయం కూడా ఇస్తారు కాలు చెయ్యి కూడదీసుకుని సర్దుకోవటానికి. 

ఢిల్లీ లోని దౌత్య కార్యాలయ ప్రాంగణంలో వాణిజ్య కార్యకలాపాలను జనవరి 16 నుండి నిలిపివేస్తున్నారు.  ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది.  అంతే కాదు దౌత్యాధికారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే ట్రాఫిక్ నియమాలననుసరించి చర్యలను తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. 

ఆర్టికిల్ 377 గురించి అన్నమాటలను అప్పుడే మర్చిపోయారు.  స్వలింగ సంపర్కం భారతదేశంలో నేరం కనుక ఆ నేరం కింద కూడా బుక్ చెయ్యగలం అన్నా అటువంటి సాహసమేమీ చెయ్యలేదు మన ప్రభుత్వం.  కేవలం ట్రాఫిక్ చలాన్లతో సరిపెట్టుకుని భారత దౌత్య ఉద్యోగిని దేవయాని ఖోబ్రాగడెకి అమెరికాలో జరిగిన అవమానానికి ప్రతిగా అమెరికా మీద ఏదో సాధించామన్న తృప్తిని కలిగించుకుందామనుకుంటోంది మన ప్రభుత్వం.

దేవయాని కేసులో భారత్ కి ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వని యుస్ ప్రభుత్వం కనీసం ప్రాథమిక విచారణకు సమయాన్ని మరో నెల రోజులు పొడిగించమని అడిగినా ససేమిరా అన్నది.  ఇక బేషరతుగా క్షమాపణ చెప్పటం ఇంకా, దేవయాని మీద కేసుని ఎత్తివెయ్యటం లాంటి పనులు ఎక్కడ చేస్తుంది యుఎస్

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles