Pm insisted i continue as minister pallam raju

PM insisted I continue as minister: Pallam Raju, Human Resources Development (HRD) M M Pallam Raju, ap bifurcation, telangana issue, samaikyandra, seemandhra people, pm manmohan singh,

PM insisted I continue as minister: Pallam Raju

పల్లం రాజు ‘విభజన’ పాట అదిరింది?

Posted: 11/25/2013 06:53 PM IST
Pm insisted i continue as minister pallam raju

సమైక్యంద్ర కోసం చివరి వరకు పోరాటం చేస్తాం అని సీమాంద్ర కేంద్ర మంత్రులు తొడలుకొట్టి, జై సమైక్యాంద్ర అని సీమాంద్ర ప్రజలు ముందు గొప్పలు పలికారు. అదే మాటను ఢిల్లీ పెద్దల ముందు వినిపిస్తామని ఢిల్లీకి వెళ్లిన వారు.. అక్కడ ఛాయ్, బిస్కెట్లు తిని .. బయటకు వచ్చి, హైకమాండ్ కు సీమాంద్ర ప్రజలు పడుతున్న బాధలు గురించి చెప్పటం జరిగిందని, రాష్ట్ర విభజన కు మేము వ్యతిరేకం అని చెప్పామని మీడియా ముందు సన్నాయి నొక్కులు నొక్కి చెప్పిన సీమాంద్ర కేంద్ర మంత్రి పల్లంరాజు ఇప్పుడు మరో కొత్త పల్లవి అందుకున్నారు.

 

రాష్ట్ర విభజన కోసం నేను చివరి వరకు పోరాటం చేసి అలసి పోయానని, ఇక నావల్ల కాదని రెండు చేతులు ఎత్తేసారు. అంటే రాష్ట్ర విభజనను నేను అడ్డుకోలేనని మీడియా ముందు చెప్పటం జరిగింది. అయితే రాష్ట్ర విభజనకు పోరాటం చేయలేనప్పుడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి, సమైక్యాంద్ర ఉద్యమంలో పాలుపంచుకోవచ్చు కాద అని సీమాంద్ర ప్రజలు అడిగితే. అందుకు పల్లంరాజు చెప్పే సమాధానం పాట అదిరింది.

 

ఇప్పటి వరకు ఏ రాజకీయనాయకుడు ఇలాంటి రాజకీయ పాట పాడి ఉండరని సమైక్యవాదులు అంటున్నారు. అసలు ఇంతకీ ఆయన పాట ఏమిటో తెలుసా? ఆయన మంత్రి పదవికి రాజీనామా చేస్తే.. ప్రజలు ఇబ్బంది పడతారని, స్వయంగా దేశ ప్రధాని మంత్రి మన్మోహన్ సింగే.. మన సమైక్యంద్ర రాజకీయ లీడర్ పల్లం రాజును.. వేడుకున్నాడని చెబుతున్నారు. వినే వాళ్లు ఉంటే.. చెప్పువాడు .. ఎన్ని వెర్రి పువ్వులైన పెడతాడు అనేదానికి పల్లం రాజు బాగా సరిపోతుందని సమైక్యవాదులు అంటున్నారు.

 

అంతేకాదండోయ్ .. మన మంత్రి పళ్లం రాజు ఇబ్బందిపడినా.. ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే పదవిలో కోనసాగుతున్నారని చెబుతున్నారు. అంటే శాఖ లన్నింటిలోకి మానవ వనరుల శాఖ చాలా కీకమైన శాఖ అని చెబుతున్నారు. ఆ శాఖ పనితీరు ఆగిపోతే ప్రజలకు ఇబ్బందిగా మారుతుందని ప్రదాని మంత్రి మన్మోహన్ సింగ్ పల్లం రాజుతో చెప్పటంతో.. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయకుండా , కేవలం ప్రజల కోసమే కేంద్రమంత్రిగా ఉన్నారని పల్లంరాజు చెబుతున్నారు.

 

అయితే పల్లం రాజు రాష్ట్ర విభజన పై పాడిన పాట అదుర్స్ అని సమైక్య వాదులు అంటున్నారు. పల్లం రాజు నియోజక వర్గ ప్రజలు మాత్రం రాబోయే ఎన్నికల్లో ప్రధాని మంత్రి కోసమే ఢిల్లీ లోని ఉండి.. సేవలు చేసుకోమని సమైక్యవాదులు అంటున్నారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ నుండి పోటీ చేసి గెలవమని సమైక్యవాదులు అంటున్నారు. అంటే పల్లం రాజు ను గెలిపించే శక్తి మాకు లేదని సీమాంద్ర ప్రజలు అంటున్నారు. విభజనను అడ్డుకోనే శక్తి నాకు లేదని చెప్పినందుకు సమైక్యవాదులు పై విధంగా చెప్పటం జరిగింది. ఇంకా ఇలాంటి నాయకులు ఎంత మంది ఉన్నారో త్వరగా బయటపడితే. మేము కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని సమైక్యవాదులు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles