రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించరాదని, సమైక్యంగా ఉంచాలన్న గట్టి నినాదంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చడానికి అన్ని రకాల ప్రయత్నాలూ జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేయటం జరిగిందని అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇక్కడ ఉద్యోగ సంఘాల వారందరినీ ఒక్కొక్కరినీ పిలుచుకుని వారిని భయపెట్టి ఉద్యమబాట నుంచి తప్పుకొనేలా చేస్తున్నారు. అంతటితో సరిపోదన్నట్లుగా సమైక్యానికి కట్టుబడి ఉన్నామని మొన్నటిదాకా చెప్పిన కేంద్ర మంత్రులంతా ఇవాళ సమైక్యాన్ని పక్కనపెట్టి ప్యాకేజీలు కావాలన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. నిజంగా వీళ్ల తీరు చూస్తుంటే అసలు మనుషులేనా అని అనిపిస్తోంది’’ అంటూ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా వీళ్లు కళ్లు తెరవాలి. అసెంబ్లీని వెంటనే సమావేశపర్చాలి. సమైక్యానికి అనుకూలంగా తీర్మానం చేయాలని వీరిద్దరినీ గట్టిగా డిమాండ్ చేస్తున్నా...’’ అని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
రాజకీయాలను పక్కన పెట్టండి. ఈ వ్యవస్థలో నిజాయితీని తీసుకురండి. అందరూ ఒక్కటి కవాల్సిన అవసరాన్ని పక్కనబెడితే మాత్రం చరిత్రహీనులుగా మిగిలి పోయే పరిస్థితి వస్తుంది. అందుకే చంద్రబాబు, కిరణ్‌లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా.. అయ్యా చరిత్రహీనులుగా మిగిలిపోకండి, రండి.. కలిసిరండి అని విజ్ఞప్తి చేస్తున్నా...’’ అని అన్నారు.
చివరిదాకా పోరాడుతాం..
సమైక్యాంధ్ర ఉద్యమం తగ్గిపోయిందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా...‘‘మా ఖర్మ ఏంటంటే.. దిగ్విజయ్, సోనియాగాంధీ గారికి కుడి భుజమో.. ఎడమ భుజమో అర్థం కావడం లేదు కానీ ఆయన కుడి భుజం అయితే కిరణ్ ఆమెకు ఎడమ భుజం లాంటి వారు.. దిగ్విజయ్ ఉద్యమం తగ్గిపోయిందంటారు.. కిరణ్ దగ్గరుండి ఉద్యమబాట నుంచి ఒక్కొక్కరినీ తప్పించే కార్యక్రమం చేస్తారు.. విభజించండి అని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఏజెంట్‌గా ఏకంగా నిరాహారదీక్షలే చేస్తారు.
నిజంగా ఇది మన ఖర్మ. అయినాగానీ నేనొక్కటైతే చెబుతాను. వీళ్లంతా మనుషులే! పైన దేవుడున్నాడు, కచ్చితంగా మేం మాత్రం ఉద్యమబాటను తీవ్రతరం చేస్తాం. చివరిదాకా పోరాటం గట్టిగా చేస్తాం’’ అని ఉద్ఘాటించారు.
సమైక్య శంఖారావం సభకు ఉద్యోగ సంఘాలను కూడా ఆహ్వానిస్తారా అని ప్రశ్నించినపుడు ‘‘ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నా.. ప్రతి ఒక్కరినీ మీడియా ముఖంగా ఆహ్వానిస్తున్నా.. సమైక్యమంటే అందరినీ కలవమనే చెబుతున్నా’’ అని అన్నారు.
విలేకరుల సమావేశంలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి, ఎమ్మెల్సీలు ..తదితరులు పాల్గొన్నారు
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more