Vemana Sathakam in Telugu 42768 Vemana Satakalu

Vemana shatakam

Vemana Sathakam, Vemana Satakalu, Telugu Satakalu, Vemana Satakalu in Telugu పాముకన్న Vemana satakam

Get the Vemana Sathakam నేలమీద పాకే పాము అన్నిటికీ భయపడుతుంది, ప్రాణభయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న బొరియల్లో దాక్కుంటుంది. ఏ పాపం చేసుకున్నానో ఇలాంటి పాపిష్టి జన్మ లభించింది అని కొందరు అంటుంటారు. అలాగే పాము జన్మని పాపిష్టి జన్మ అని అన్నారు వేమన. In Telugu Vemana Satakalu

వేమన శతకం

Posted: 03/05/2013 03:39 PM IST
Vemana shatakam

పాముకన్న లేదు పాపిష్టి జీవంబు
అట్టి పాము చెప్పినట్టు వినును
ఖలుని గుణము మాన్పు ఘను లెవ్వరును లేరు
విశ్వదాభిరామ వినుర వేమ

నేలమీద పాకే పాము అన్నిటికీ భయపడుతుంది,  ప్రాణభయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న బొరియల్లో దాక్కుంటుంది.  ఏ పాపం చేసుకున్నానో ఇలాంటి పాపిష్టి జన్మ లభించింది అని కొందరు అంటుంటారు.  అలాగే పాము జన్మని పాపిష్టి జన్మ అని అన్నారు వేమన.  అటువంటి పాము కూడా చెప్పినట్టు వింటుంది.  అందుకే పాములను బుట్టలో పెట్టగలుగుతారు, వాటిని ఆడించగలుగుతారు.  కానీ గుణ హీనుడు, దుర్మార్గుడైన మనిషిని మార్చటం ఎవరి తరమూ కాదంటారు శతక కర్త.  అంతటి ఘనులెవరూ లేరని ఆ మాటను చాలా ఘనంగా చెప్పారాయన.  

పాములో విషమున్నా, వేటాడి తినటానికి ఆ విషాన్ని ఉపయోగించదది.  తన ప్రాణాన్ని రక్షించుకోవటానికి మాత్రమే పాము కాటు వేస్తుంది.  కానీ దుర్మార్గుడైన వాడు తనలోని విషమనే దుర్మార్గపు ఆలోచనని ఎదుటివాడిని నాశనం చెయ్యటానికే ఉపయోగిస్తాడు.  ఎవరి సొమ్మైనా కబళించటానికే చూస్తాడు.  అందుకే అటువంటి వాడిని మార్చే మొనగాడు భూమ్మీదనే లేడు అంటారాయన.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vemana shatakam
Vemana satakam 18  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 15 | తప్పులెన్నువారు తండోప తండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : ప్రపంచంలో ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలవరకు... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 14 | పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు పట్టెనేని బిగియఁ బట్టవలయు పట్టు విడుటకన్న, బరగఁ జచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : పట్టుదల లేనిదే ఏ కార్యాన్నిగాని, పనినిగాని మొదలుపెట్టకూడదు. అసలు ఆలోచించుకోకూడదు కూడా. ఒకవేళ... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 12 | చంపదగిన యట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు సేయరాదు పొనగ మేలుచేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : మనకు ఎల్లప్పుడూ హాని కలిగించే మన శత్రువును చంపే సమయం వచ్చినప్పుడు.. అతనిని... Read more

  • Vemana satakam in telugu

    వేమన శతకము

    Apr 11 | చెప్పులోన ఱాయి చెవిలోని జోరిగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వదాభిరామ వినురవేమ ! భావం : చెప్పులో రాయి రావడం, చెవిలో జోరిగ తిరగడం, కంటిలో నలుసు పడటం,... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 08 | చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీట గలిసె బ్రాప్తి గలుగుచోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ ! తాత్పర్యము : ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు ముత్యంగా మారిపోతుంది. అదే చినుకు... Read more