రాజసం ఉట్టిపడే ఠీవితో ఉండే రెండు రాతి సింహా లు త్వరలో రాజ్‌భవన్‌లో కొలువుదీరనున్నాయి. తిరుపతిలోని టీటీడీ శిల్పకళా ఉత్పత్తి విభాగం వీటి ని తయారు చేస్తున్నది. తన పేరు నర'సింహన్' అనో, మూడు సింహాల బొమ్మ ఉండే క్యాప్‌ను సగర్వంగా ధరించే పోలీస్ శాఖ లో తాను ఉన్నతాధికారిగా సేవలు అందించానన్న కారణంగానో సింహాల ప్రతిమలు అంటే నరసింహన్‌కు చాలా ఇష్టం. ఆయన గవర్నర్ పదవి చేపట్టగానే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేయించిన రెండు సింహల విగ్రహాలను రాజ్‌భవన్ ముందు పెట్టించారు.
ఐదేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఆ విగ్రహాలు దెబ్బతినడంతో వాటి స్థానంలో కలకాలం నిలిచే రాతి సింహాలను తయారు చేయించాలని భావించారు. ఈ బాధ్యతను తన కార్యదర్శి రమేశ్‌కుమార్‌కు అప్పగించారు. ఆయన ఈ పనిని వెంటనే టీటీడీ శిల్పకళా ఉత్పత్తి విభాగానికి అప్పగించారు. గవర్నర్ కోరడం, టీటీడీ ఉన్నతాధికారులు ఓకే చెప్పడంతో విగ్రహాల తయారీ కోసం తమిళనాడులోని కాంచీపురం నుంచి నల్లని గ్రానైట్ రాయి తెప్పించారు. శిల్పకళాశాల పూర్వ విద్యార్థి మురుగన్‌కు విగ్రహాలు చెక్కే బాధ్యత అప్పగించారు. ఆయన సుమారు 9 నెలలు శ్రమించి ఒక్కొక్కటి 3 టన్నుల బరువు ఉండే రెండు సింహాలను సిద్ధం చేశారు. ప్రస్తుతం వీటికి తుది మెరుగులు దిద్దుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more