న్యాయస్థానాల్లో సిబిఐ వరసగా భంగపాటుకు గురైంది. నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాల్సిన కేంద్ర దర్యాప్తు సంస్థ హడావుడిలో తప్పిదాలకు పాల్పడుతోంది. నేర పరిశోధనలో జాతీయస్థాయిలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థగా చెప్పుకునే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనెవస్టిగేషన్ (సిబిఐ)కి వరసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఫలితంగా న్యాయస్థానాల్లో చుక్కెదురవుతోంది. వైఎస్ జగన్‌కు చెందిన మీడియా సంస్థలు, కోనేరు ప్రసాద్, సునీల్‌రెడ్డిలకు చెందిన వ్యక్తిగత ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి ఇవ్వాలన్న సిబిఐ పిటిషన్‌పై సిటీ సివిల్ కోర్టు కడిగిపారేసింది. ఇది జరిగి ఇరవై నాలుగు గంటలు గడవకముందే నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం అదే స్థాయిలో స్పందించింది. వైఎస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన మూడో చార్జిషీట్ నిబంధనల ప్రకారం లేదని, తప్పుల తడకగా ఉందని, అనేక లోపాలు ఉన్నాయని గుర్తించిన సిబిఐ న్యాయస్థానం వాటన్నింటినీ సరిచేసి మరో చార్జిషీట్ దాఖలు చేయాలని పేర్కొంటూ సిబిఐకి తిప్పి పంపింది. ఇది సిబిఐకి చాలా అవమానమని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. రాష్ట్రంలో అతిముఖ్యమైన కేసుల్లో ఒకటైన జగన్ ఆస్తుల కేసులో అన్ని కోణాల్లో ఆచితూచి దాఖలు చేయాల్సిన చార్జిషీట్‌ను ఇలా తప్పులతో దాఖలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more