Gold & Copper reserves Found in Madina Munawarah మదీనాలో బంగారం, రాగి నిక్షేపాల గుర్తింపు: సౌదీ

Saudi arabia announces discovery of gold copper deposits in madina

Saudi Arabia news,Saudi Arabia News Today,Saudi Arabia gold discovery,Saudi Arabia News Latest

Saudi Arabia announced the discovery of new sites for gold and copper ore deposits in the Madinah region earlier this week. The Saudi Geological Survey (SGS), represented by the Survey and Mineral Exploration Centre said that the discoveries of gold deposits were done within the boundaries of the Aba Al-Raha in the Madinah region, Saudi Press Agency (SPA) reported.

మదీనాలో బంగారం, రాగి నిక్షేపాల గుర్తింపు: సౌదీ కీలక ప్రకటన

Posted: 09/23/2022 03:54 PM IST
Saudi arabia announces discovery of gold copper deposits in madina

ముస్లింల పవిత్ర నగరం మదీనా ప్రాంతం చమురు నిక్షేపాలకు ప్రసిద్ది అన్నది తెలిసిన విషయమే. అయితే ఇక్కడ బంగారం నిక్షేపాలు కూడా ఉన్నాయన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తాజాగా మదీనాలో బంగారం, రాగి నిక్షేపాలు ఉన్నట్లు సౌదీ ఆరేబియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. బంగారు, రాగి కొత్త గనులను కనుగొన్నట్లు ఆ దేశానికి చెందిన జియోలాజికల్‌ సర్వే తన ట్వీట్‌లో తెలిపింది. మదీనా ప్రాంతంలో ఉన్న అబా అల్‌ రహ వద్ద బంగారం నిక్షేపాలు ఉన్నట్లు వెల్లడించారు. వాది అల్ ఫారా ప్రాంతంలో సుమారు నాలుగు చోట్ల రాగి గనులు ఉన్నట్లు భావిస్తున్నారు.

బంగారం, రాగి గనుల వల్ల ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించవచ్చు అని సౌదీ జియోలాజికల్ సర్వే తన రిపోర్ట్‌లో రాసింది. తాజా ఆవిష్కరణల ద్వారా భవిష్యత్ పెట్టుబడుల దిశగా మరిన్ని అవకాశాలకు ద్వారాలు తెరుస్తున్నామని సౌదీ జియోలాజికల్ సర్వే పేర్కొంది. కాగా, ఈ నూతన నిక్షేపాల ద్వారా సౌదీకి 533 మిలియన్ డాలర్ల పెట్టుబడి వచ్చే అవకాశం ఉందని, 4 వేల ఉద్యోగాలు కూడా లభిస్తాయని స్థానిక మీడియా పేర్కొంది. సౌదీ అబిరేయాలో 5,300 ప్రాంతాల్లో ఖనిజ లవణాలు లభ్యమవుతాయని సౌదీ జియాలజిస్ట్స్ కోఆపరేటివ్ అసోసియేషన్ చైర్మన్ అబ్దులజీజ్ బిన్ లబాన్ గతంలో తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles