School girl recites names of 75 districts of Uttar Pradesh చిన్నారి టాలెంట్ కు ఫిదా అవుతున్న నెటిజనులు.!

School girl recites names of 75 districts of uttar pradesh internet applauds her

student recites districts video, internet applauds girl student, Manvi Chaurasia viral videos, deoria student viral video, viral videos UP, Adarsh Prathmik Vidyalaya, Manvi Chaurasia viral video, Shubhankar Mishra Viral video, Shubhankar Mishra Twitter, Uttar Pradesh, viral video

A little girl earned the praise of the internet after she recited the names of the districts of Uttar Pradesh in just 38 seconds. The girl, identified as Manvi Chaurasia, is a student of Adarsh Prathmik Vidyalaya. It is located in the Deoria district of Uttar Pradesh. The video was posted on Twitter by Shubhankar Mishra.

ITEMVIDEOS: చిన్నారి టాలెంట్ అమోఘం.. ఫిదా అవుతున్న నెటిజనులు.!

Posted: 09/14/2022 07:37 PM IST
School girl recites names of 75 districts of uttar pradesh internet applauds her

ఉత్తర్ ప్రదేశ్ చిన్నారికి సంబంధించిన వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అమెలో ఉన్న టాలెంట్ కు నెటిజనులు ఫిదా అవుతున్నారు. నెటిజనులను కూడా ఔరా అంటూ అబ్బురపర్చే ఈ చిన్నారి ఏం చేసిందో తెలుసా.? దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్. ఈ రాష్ట్రంలోని 75 జిల్లాల పేర్ల‌ను టక టకామని నిమిషంలోపే చెప్పేసింది. ఔనా అంటూ ఆశ్చర్యపోతున్నారా.. ఇంకా చెప్పాలంటే.. కేవలం 38 సెకండ్ల‌లో 75 జిల్లాల పేర్లను సరళంగా చెప్పాసిందీ చిన్నారి. దీంతో ఈ చిన్నారి బాలిక వీడియో ఇంట‌ర్‌నెట్‌లో వైర‌ల్ అవుతోంది. బాలిక టాలెంట్‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని దియోరియా జిల్లాకు చెందిన బాలిక యూపీలోని జిల్లాల పేర్లను అడ్డదిడ్డంగా కాకుండా అనర్గళంగా.. క్రమపద్దతిలో.. అక్షర క్రమంలో చెప్పడం నెటిజనులను అబ్బురపరుస్తోంది. ఈ చిన్నారి టాలెంట్ కు ఫిదా అయిన శుభాంక‌ర్ మిశ్రా అనే ట్విట్ట‌ర్‌ యూజర్ తన అకౌంట్ ద్వారా వీడియోను షేర్ చేశారు. బాలికను దియోరియా జిల్లా ఆద‌ర్శ్ ప్రాధ‌మిక విద్యాల‌య విద్యార్ధి మాన్వి చౌరాసియాగా గుర్తించారు. అమేజింగ్ ఈ బాలిక నైపుణ్యానికి మీరు శాల్యూట్ చేస్తార‌ని ఈ వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చారు.ఈ వీడియోకు ఇప్ప‌టివ‌ర‌కూ 21,500 వ్యూస్ రాగా పెద్ద‌సంఖ్య‌లో నెటిజన్లు స్పందించారు. బాలిక నైపుణ్యాన్ని మెచ్చుకున్న నెటిజ‌న్లు ఆమెకు మంచి భ‌విష్య‌త్ ఉందని బ్లెస్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles