GST on cancellation of confirmed train tickets, hotel bookings బుకైన టికెట్లను కాన్సిలేషన్ చేసుకున్నా..

Bad news for travellers now gst charge on cancellation of train tickets hotel bookings

gst on cancelled train tickets, gst, hotel bookings, cancelled confirmed ticket, train tickets cancellation gst, gst to be imposed, train tickets gst, hotel bookings gst, train ticket gst, gst latest news, train tickets cancelled gst, Indian Railways, IRCTC, Train Ticket, ticket booking, ticket booking, AC berths cancellation, GST charges, Indian Railways News, Business News

In a piece of bad news for would-be travellers and vacationers, the Finance Ministry on August 3 issued a circular stating that the cancellation of confirmed train tickets would now be costlier, as it would attract Goods and Services Tax (GST).

బుకైన టికెట్లను కాన్సిలేషన్ చేసుకున్నా.. రద్దుపై జీఎస్టీ చార్జీల వడ్డన

Posted: 09/01/2022 05:49 PM IST
Bad news for travellers now gst charge on cancellation of train tickets hotel bookings

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ దేశంలోని ప్రజలపై వడ్డింపుల పర్వాన్ని కొనసాగిస్తోంది. స్వతంత్ర భారతావనిలో గత డెబై అయిదేళ్లుగా లేని విధంగా రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులై బియ్యం, గోదుమలు, బెల్లం, పాలు, పెరుగు ఇత్యాదులపై జీఎస్టీ విధించిన కేంద్రం.. గణనీయంగా జీఎస్టీ వసూళ్లను రాబడుతోంది. అయితే ఈ వసూళ్లతో కూడా కేంద్రం సంతృప్తి చెందడం లేదా.? అంటూ ఔను అనక చెప్పని పరిస్థితి. అందుకనే మరింత వసూళ్లు రాబట్టేందుకు మరిన్నీ మార్గాలనే అన్వేషిస్తోంది. ఇన్నాళ్లు ఏదైనా కొనుగోలు చేస్తే మాత్రమే విధించే జీఎస్టీ పన్ను ఇకపై కొత్తపుంతలు తొక్కనుంది.

ఆ మార్గాలేమిటీ అంటే.. ఇన్నాళ్లు ఏదైనా టికెట్ బుక్ చేస్తే మాత్రమే పడే జీఎస్టీ.. వాటిని కాన్సిల్ చేసుకున్న తరుణంలో మాత్రం తిరిగి ఇచ్చే సౌలభ్యం లేదు. పోతే పోనీలే అని అనుకుంటే.. కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శాఖకు చెందిన అధికారులు ఇలాంటి ప్రశ్నలు తలెత్తకుండా.. ఇకపై బుకైన టికెట్లను కాన్సిల్ చేసినా.. కాన్సిలేషన్ చార్జీలతో పాటు ఆ చార్జీలపై కూడా జీఎస్టీని విధించే కొత్త మార్గాన్ని కనుగోన్నారు. ఇకనేం ఈ మార్గం కూడా అమల్లోకి వచ్చేసింది. దీంతో కన్ఫామ్ అయిన రైలు, విమాన, హోటల్ టిక్కెట్లు రద్దు చేస్తున్నారా? ఇక ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

బుక్ చేసేప్పుడే ఒక్కటికి రెండు సార్లు అలోచించుకుని బుక్ చేయండీ.. కాన్సిల్ చేద్దామంటే మాత్రం ఆ టిక్కెట్ల కాన్సిలేషన్ చార్జీలతో పాటు ఈ చార్జీలపైనా కూడా జీఎస్టీ కట్టాల్సిందే. దీంతో, టిక్కెట్లను కాన్సిల్ చేయడం కూడా ఇకపై ఖరీదైన వ్యవహారం కానుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త రకం జీఎస్టీ విధింపుపై సర్క్యులర్ జారీ చేసింది. ఈ నెల 3వ తేదీనే ఆర్థిక మంత్రిత్వ శాఖ పన్ను పరిశోధన విభాగం జారీ చేసిన ఈ సర్క్యులర్ ప్రకారం టిక్కెట్ల బుకింగ్ అనేది ఒక 'కాంట్రాక్టు' అని పేర్కొంది. దీని కింద సర్వీస్ ప్రొవైడర్ (ఐఆర్సీటీసీ /ఇండియన్ రైల్వేస్) వినియోగదారుడికి సేవలను అందిస్తానని హామీ ఇస్తుందని తెలిపింది.

కాబట్టి టిక్కెట్లు రద్దు చేసుకున్నా పన్ను చెల్లించాల్సిందే అని స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, ఫస్ట్ క్లాస్ లేదా ఏసీ కోచ్ టిక్కెట్‌ను రద్దు చేసేందుకు క్యాన్సెలేషన్ చార్జీపై అదనంగా 5 శాతం జీఎస్టీ విధిస్తారు. విమాన ప్రయాణం, హోటల్ టిక్కెట్లను క్యాన్సిల్ చేసినా ఐదు శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు వర్తించే జీఎస్టీ రేటునే రద్దు చేసుకున్నప్పుడు కూడా వర్తింపచేస్తున్నారు. క్యాన్సెలేషన్ ఫీజు (రద్దు ఛార్జీ) అనేది ఒప్పంద ఉల్లంఘనకు బదులుగా జరిగే చెల్లింపు కాబట్టి దానిపై జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

‘ప్రయాణికులు తమ ఒప్పందాన్ని ఉల్లంఘించినప్పుడు, సర్వీస్ ప్రొవైడర్‌కు చిన్న మొత్తంలో పరిహారం చెల్లించాలి. దీన్ని క్యాన్సెలేషన్ చార్జీగా వసూలు చేస్తారు. క్యాన్సెలేషన్ చార్జీ అనేది ఒప్పందాన్ని ఉల్లంఘించడం కాదు. అది ఒక పేమెంట్ మాత్రమే. కాబట్టి దానికి జీఎస్టీ వర్తిస్తుంది’ అని  నోటిఫికేషన్ లో పేర్కొన్నది. రైల్వే ప్రయాణాల్లో ఫస్ట్ క్లాస్, ఏసీ కోచ్ టిక్కెట్ల బుకింక్స్ పైనే ఐదు శాతం జీఎస్టీ విధిస్తున్నారు. సెకండ్ క్లాస్, ఇతర తరగతులకు జీఎస్టీ లేదు. కాబట్టి, ఫస్ట్ క్లాస్, ఏసీ కోచ్ ల టిక్కెట్లు రద్దు చేస్తేనే.. క్యాన్సెలేషన్ ఫీజుపై అదనంగా జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles