Afghan fan celebrates India's win by kissing Pandya on TV హార్థిక్ పాండ్యాకు ముద్దుపెట్టిన అప్ఘన్ క్రికెట్ అభిమాని..

Afghanistan cricket fan kisses hardik pandya on tv screen to celebrate india s victory over pakistan

hardik,Pandya, kiss, internet, hardik pandya, fan kisses pandya, fan kisses hardik, fan kisses hardik pandya, afghanistan fan, afghanistan fan kisses hardik, afghanistan fan kisses pandya, afghanistan fan kisses hardik pandya, ind vs pak, india vs pakistan, viral video

A video that has surfaced on social media suggests that India's win over Pakistan has transcended borders as an Afghanistan fan was seen celebrating the victory with equal pomp and joy. In fact, the fan's adrenaline rush was such that he even kissed Pandya over the television screen, the video of which has since gone viral.

టీమిండియా విజయంతో.. హార్థిక్ పాండ్యాకు ముద్దుపెట్టిన అప్ఘన్ క్రికెట్ అభిమాని..

Posted: 08/30/2022 09:34 PM IST
Afghanistan cricket fan kisses hardik pandya on tv screen to celebrate india s victory over pakistan

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో దాయాధి దేశాల మధ్య జరిగిన మ్యాచ్ కాసింత చివరి వరకు ఉత్కంఠ రేకెత్తించిన విషయం తెలిసిందే. గెలువు అవకాశాలు ఉన్నా దానిని టీమిండియా అందుకోగలదా.? పాక్ బౌలర్ల ధాటికి వీరు నిలబడి చివరి ఓవర్లో అవసరమైన పరుగులు సాధించగలరా.? అన్న అనుమానాలు రేకెత్తాయి. లేదంటే పాకిస్థాన్ బౌలర్లు తమ అత్యత్తుమ ప్రదర్శనతో టీమిండియాకు విజయాన్ని దూరం చేస్తారా.? అన్న సందేహాలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో అదే ఓవరల్లో తొలి బంతిని భారీ షాట్ కోట్టేందుకు ప్రయత్నించిని రవీంద్ర జడేజా వికెట్ పారేసుకోవడం మరింత ఉత్కంఠకు తెరలేపింది.

దీంతో ప్రపంచవ్యాప్తంగా చివరి ఓవర్ పై కోట్లాది రూపాయల బెట్టింగ్ కూడా సాగిందని సమాచారం. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటేనే తారాస్థాయికి చేరే బెట్టింగ్ లు.. దాదాపు మ్యాచ్ ఆద్యంతం భారత్ పేవరేట్ గానే సాగాయి. అయితే టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా 16 ఓవర్ల నుంచి.. విజయం రెండు జట్లతో దోబుచులాడుతుండటంతో చివరకు గెలుపు ఎవరి సోంతం అవుతుందన్న అంశంపై బెట్టింగ్ లు జోరందుకున్నాయి. కాగా, ఈ మ్యాచ్ లో చివరి ఓవర్లో హార్థిక పాండ్యా విన్నింగ్ షాట్ కోట్టడంతో భారత్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్ ను ఓడించింది. హార్దిక్ పాండ్యా సిక్సర్‌తో ఆట‌ను ముగించ‌గా, స్టేడియంతోపాటు దేశం మొత్తం సంబరాలు అంబరాన్నంటాయి.

భారతీయులే కాదు, ఆఫ్ఘనిస్థాన్‌లోని అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేశారు. హార్దిక్ పాండ్యాను తన టెలివిజన్ స్క్రీన్‌పై ఆఫ్ఘన్ అభిమాని ముద్దుపెట్టుకుంటున్న వీడియో నెట్టింట‌ వైరల్‌గా మారింది. మ్యాచ్ ముగిసిన వెంటనే ఒక యువ అభిమాని టీవీ స్క్రీన్ వైపు పరిగెత్తాడు. హార్దిక్ పాండ్యా తెరపై కనిపించ‌గానే ముద్దు పెట్టుకున్నాడు. ఈ ట్వీట్‌ను మహిళా హక్కుల కార్యకర్త యూసఫ్‌జాయ్ అనయత్ షేర్ చేశారు. ‘మా సోదరులందరికీ అభినందనలు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలంద‌రం టీమిండియా విజయాన్ని సెల‌బ్రేట్ చేసుకుంటున్నాం.’ అని క్యాప్ష‌న్ ఇచ్చారు. కాగా, ఈ వీడియో ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ వీడియో మిలియ‌న్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles