Kerala Court Sexual Harassment Verdict Stirs Row మహిళ వస్త్రాధారణపై కోర్టుఅభ్యంతరం.. నిందితుడికి బెయిల్..!

Kerala court cites provocative dress to grant bail in sexual harassment case

District Session Court, Kerala Session Court, sexually provocative dress, social activist, writer, Civic Chandran, sexual abuse case, Kozhikode Sessions Court, sexual provocative, photograph, physically disabled, IPC Section 354 A, sexual harassment, sexual assault, sexism, Kerala court, feminism,Kerala, Sexual harassment, Sexual assault, sexism, Kerala court, Feminism, Civic Chandran, Civic Chandran bail, Civic Chandran sexual harassment, kerala court sexual harassment, sexual remark, Section 354A, Crime

A District Session Court in Kerala triggered a row after its verdict that the offence under sexual harassment is not prima facie attracted when the woman was wearing a "sexually provocative dress". The state women commission strongly deplored the ruling. The court made the observation last week while granting bail to 74-year-old social activist and writer Civic Chandran in a sexual abuse case.

మహిళ వస్త్రాధారణపై కోర్టుఅభ్యంతరం.. నిందితుడికి బెయిల్..!

Posted: 08/17/2022 07:21 PM IST
Kerala court cites provocative dress to grant bail in sexual harassment case

లైంగిక వేధింపుల నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ కేర‌ళ‌లోని ఒక సెష‌న్స్ కోర్టు చేసిన వ్యాఖ్య‌లు వివాద‌స్ప‌ద‌ంగా మారాయి. బాధితురాలు రెచ్చ‌గొట్టేలా దుస్తులు ధ‌రించింద‌ని, అందువ‌ల్ల‌నే ఈ లైంగిక వేధింపుల నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నాన‌ని ఆ న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించారు. న్యాయస్థానాలే మహిళల దుస్తులధారణపై వ్యాఖ్యలు చేస్తూ.. అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ.. లైంగిక వేధింపుల నిందితుడికి బెయిల్ మంజూరు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కేర‌ళ‌లోని సెష‌న్స్ కోర్టు లైంగిక వేధింపుల కేసులో నిందితుడుకు బెయిల్ కల్పిస్తూ చేసిన ఈ వ్యాఖ్య‌లు వివాద‌స్ప‌ద‌మ‌య్యాయి.

బాధితురాలు రెచ్చ‌గొట్టేలా దుస్తులు ధ‌రించింద‌ని, అందువ‌ల్ల‌నే ఈ లైంగిక వేధింపుల నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నాన‌ని ఆ న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించారు. న్యాయ‌మూర్తి వ్యాఖ్య‌ల‌పై మ‌హిళాహ‌క్కుల నేత‌లు మండిప‌డ్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళల వస్త్రాధారణపై న్యాయస్థానాలు, న్యాయమూర్తులే వ్యాఖ్యలు చేయడం.. అంతటితో ఆగకుండా ఏకంగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నిందితులకు బెయిల్ మంజూరు చేయడంపై తీవ్రంగా మండిపడుతున్నాయి. లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన 74 ఏళ్ల ర‌చ‌యిత చంద్ర‌న్ కు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేస్తూ కోజికోడ్ జిల్లాలోని సెష‌న్స్ కోర్టు న్యాయ‌మూర్తి కృష్ణ‌కుమార్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

నిందితుడు చంద‌న్ కోర్టుకు స‌మ‌ర్పించిన ఫొటోల‌ను చూపుతూ.. బాధితురాలు రెచ్చ‌గొట్టేలా డ్రెస్ వేసుకున్నందువ‌ల్ల నిందితుడిపై ఐపీసీ 354ఏ సెక్ష‌న్ వ‌ర్తించ‌ద‌ని జ‌డ్జి వ్యాఖ్యానించారు. ``ఫిర్యాదుదారు కావాల‌నే లైంగికంగా రెచ్చ‌గొట్టేలా దుస్తులు వేసుకుంద‌ని ఈ ఫొటోల ద్వారా స్ప‌ష్టంగా తెలుస్తోంది. అందువ‌ల్ల ఈ కేసులో సెక్ష‌న్ 354ఏ వ‌ర్తించ‌దు`` అని న్యాయ‌మూర్తి అన్నారు. అనంత‌రం ర‌చ‌యిత చంద్ర‌న్‌కు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేశారు. న్యాయ‌మూర్తి వ్యాఖ్య‌ల‌తో పాటు నిందితుడికి ముంద‌స్తు బెయిల్ మంజూరు చేయ‌డంపై మ‌హిళాహ‌క్కుల కార్య‌క‌ర్త‌లు కేర‌ళ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.

ర‌చ‌యిత చంద్ర‌న్ వ‌య‌స్సు 74 ఏళ్ల‌ని, అదీకాక ఆయ‌న శారీర‌క వైక‌ల్యం ఉన్న వ్య‌క్తి, అలాంటి బ‌ల‌హీనుడైన వ్య‌క్తి బాధితురాలిని బ‌ల‌వంతంగా ఒళ్లో కూర్చోబెట్టుకున్నాడ‌న్న‌ ఆరోప‌ణ‌లు న‌మ్మ‌శ‌క్యంగా లేవ‌ని కూడా న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించారు. అలాగే, ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డంలో జ‌రిగిన ఆల‌స్యాన్ని కూడా జ‌డ్జి ప్ర‌శ్నించారు. 2020లో ఫిర్యాదు చేస్తే, రెండేళ్ల త‌రువాత ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డ‌మేంట‌ని కోర్టు ప్ర‌శ్నించింది. 2020లో జ‌రిగిన ఒక రైట‌ర్స్ కాన్ఫెరెన్స్‌లో ర‌చ‌యిత చంద్ర‌న్ త‌న‌ను లైంగికంగా వేధించాడ‌ని బాధితురాలు రెండేళ్ల క్రితం కేసు పెట్టింది. ర‌చ‌యిత చంద్ర‌న్ కోర్టుకు స‌మ‌ర్పించిన ఫోటోలు తాను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన‌వ‌ని బాధితురాలు చెప్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles