If kids can go to school at 7am, SC can start at 9am: Justice Lalit కొత్త ఆచరణకు శ్రీకారం చుట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత్

If kids can go to school at 7 am sc can start functioning at 9 am justice uu lalit

Justice Lalit, Supreme Court, Sudhanshu Dhulia, justice Uday U Lalit, Justice S Ravindra Bhat, Former attorney general, Mukul Rohatgi, Juditial, Law

If children can go to school at seven in the morning, why cannot judges and lawyers start their day at nine, justice Uday U Lalit remarked on Friday as the Supreme Court judge began hearing cases an hour before the usual time. Supreme Court benches assemble at 10.30am on weekdays to commence the business of the day. They sit till 4pm, preceded by a lunch break for an hour between 1pm and 2pm.

పిల్లలు 7 గంటలకు స్కూళ్లకు వెళ్లగా.. కోర్టు 9 గంటలకు మొదలు కాకూడదా?: సుప్రీం న్యాయమూర్తి

Posted: 07/15/2022 07:22 PM IST
If kids can go to school at 7 am sc can start functioning at 9 am justice uu lalit

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్ ఓ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఏదైనా విషయాన్ని పది మందికి చెప్పేముందు తాను ఆచరించడం కూడా ముఖ్యమని భావించే ఆయన.. ముందుగా తాను ఆచరించిన విషయాన్ని ఇకపై అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇంతకీ అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తి దేనిని ఆచరణలో పెట్టాలని అనుకున్నారు.? అనేగా మీ సందేహం. సాధారణంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ప్రతి రోజు ఉదయం 10.30 గంటలకు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి.

అయితే రోజు మధ్యలో 1గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్న ఈ సమయ పాలనకు భిన్నంగా జస్టిస్ లలిత్ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం ఉదయం 9.30 గంటలకు విచారణలు మొదలు పెట్టింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ సుదాన్షు ధూలియా కూడా ఉన్నారు. బెయిల్ కేసులో వాదలను వినిపించడానికి వచ్చిన మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి, ధర్మాసనం ముందుగా విచారణలు ప్రారంభించడాన్ని ప్రశంసించారు. ‘‘9.30 గంటలకు అన్నది కోర్టుల ప్రారంభానికి సరైన సమయం అన్నది నా అభిప్రాయం’’ అని రోహత్గి పేర్కొన్నారు.

దీనికి జస్టిస్ లలిత్ స్పందిస్తూ.. కోర్టులు ముందుగానే ప్రారంభమవ్వాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయం కూడా అని చెప్పారు. ‘‘ఉదయం 9 గంటలకు విచారణ మొదలు పెట్టడం చక్కగా ఉంటుంది. మన పిల్లలు ఉదయం 7 గంటలకే స్కూలుకు వెళుతున్నప్పుడు, మనం 9 గంటలకు కోర్టును ఎందుకు ప్రారంభించకూడదు? అని నేను తరచుగా చెబుతూనే ఉన్నాను’’ అని పేర్కొన్నారు. వచ్చే నెల 27న భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి పదవిని జస్టిస్ లలిత్ అలంకరించనున్నారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. దాంతో కోర్టుల సమయాన్ని అధికారికంగా మారుస్తారా? అన్నది చూడాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Justice Lalit  Supreme Court  Sudhanshu Dhulia  Justice S Ravindra Bhat  Mukul Rohatgi  Juditial  Law  

Other Articles