తమ బిడ్డ ఎంతో ధైర్యంగా వెళ్లి సముద్ర సింహంతో ఆడుకుంటోందన్న వీడియోను తీసి.. నెట్టింట్లో పోస్టు చేసి.. దానిని వైరల్ చేయాలని భావించారు చిన్నారి తల్లిదండ్రులు. అయితే సర్వసాధారంగా చిన్నారి పిల్లలను చూసినప్పుడు మూగజీవాలు కూడా వారితో ఎంతో ప్రేమగా మెలుగుతాయి. అయితే సముద్ర సింహం కూడా అదే విధంగా వ్యవహరిస్తుందని అనుకుని తమ చిన్నారిని వదిలిపోగా.. ఆ బాలిక తనకు చిత్రంగా కనిపించిన సముద్ర సింహం వద్దకు వెళ్లగా అది కాస్తా చిన్నారిపై దాడి చేయబోయింది. అప్రమత్తమైన చిన్నారి తండ్రి వెంటనే వచ్చి చిన్నారిని పక్కకు జరిపారు.
ఇలా ఆ చిన్నారి తృటిలో సముద్రసింహం బారి నుంచి తప్పించుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆ బాలిక తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడ్డారు. కంటెంట్ హంగ్రీ పేరెంట్స్ అంటూ చిన్నారి తల్లిదండ్రులను ట్రోల్ చేస్తున్నారు. అయితే చిన్నారి తల్లిదండ్రులు మాత్రం తాము చేసిన తప్పు మరెవరూ చేయకూడదని తాము ఈ వీడియోను నెట్టింట్లో పోస్టు చేశామని వారు పేర్కోనడంతో వారి నిర్ణయాన్ని పలువురు స్వాగతించారు. అగ్రరాజ్యం అమెరికాలో ఈ సంఘటన జరిగింది. రోడ్డు పక్కగా ఉన్న సీ లైన్పైకి ఒక బాలిక ఎక్కి కూర్చొంది. ఆ చిన్నారి పేరెంట్స్ వీడియో తీయసాగారు.
అయితే ఆ సముద్ర సింహం ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆ బాలికపై దాడి చేయబోయింది. దీంతో ఆ చిన్నారి అదుపు తప్పి రోడ్డుపై పడింది. వెంటనే అప్రమత్తమైన తండ్రి ఆ బాలికను పక్కకు తీసుకెళ్లాడు. కాగా, రెడ్డిట్లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆ చిన్నారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తల్లిదండ్రులపై నెటిజన్లు మండిపడ్డారు. ఒక జంతువు వద్ద బాలికను ప్రమాదకరంగా ఉంచి వీడియో తీయడంపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక తండ్రిని తెలివి తక్కువ వ్యక్తి, ఇడియట్ అని కొందరు తిట్టారు. అతడ్ని శిక్షించాలని మరి కొందరు డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more