CM KCR signature is a curse for farmers: Rewanth Reddy కేసీఆర్ సంతకమే రైతులకు శాపం: కవితకు రేవంత్ రెడ్డి కౌంటర్

Cm kcr signature is a curse for farmers rewanth reddy counter to kavitha

Rahul Gandhi, Revanth Reddy, Kalvakuntla Kavitha, CM KCR, KCR signature, grain procurement, appeasing farmers, BJP govt, Telangana, Politics

The war of tweets is going on in Telangana politics. Congress critisizes that the BJP and TRS parties have been playing a behind-the-scenes drama on the issue of grain procurement and appeasing the farmers.

కేసీఆర్ సంతకమే రైతులకు శాపం: కవితకు రేవంత్ రెడ్డి కౌంటర్

Posted: 03/29/2022 11:39 AM IST
Cm kcr signature is a curse for farmers rewanth reddy counter to kavitha

తెలంగాణ రాజకీయాల్లో ట్వీట్ల వార్‌ నడుస్తోంది. ధాన్యం కొనుగోలు, రైతులను మభ్యపెట్టే విషయంలో అది నుంచి బీజేపి, టీఆర్ఎస్ పార్టీలు తెరముందు ఓ డ్రామాను ఆడుతూ.. తెరవెనుక మరో నాటకాన్ని నడిపిస్తోందని అరోపిస్తోన్నారు కాంగ్రెస్‌ నేతలు, డ్రామాలు, రాజకీయ లబ్ది కోసం కాకుండా రైతుల సంక్షేమం కోసం.. వారికి వెన్నుదన్నుగా నిలిచే చర్యలకు పూనుకోవాలని కాంగ్రెస్ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను తూర్పారబడుతూనే వుంది. కాగా ఈ అంశం విషయంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వాడీవేడిగా రాజకీయ విమర్శలు కొనసాగుతుండగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ధాన్యం కొనుగోలు విషయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకూ, రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుంది. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి’ అంటూ డిమాండ్‌ చేశారు.


కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ పై తనదైన ధోరణిలో స్పందిస్తూనే.. చురకలు అంటించాలని భావించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దానికి ప్రతీగా మరో ట్వీట్ చేశారు. ‘‘రాజకీయ లబ్ధి కోసం సంఘీభావం తెలపడం మాత్రమే కాదని.. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలతో కలిసి నిరసనలకు కలిసి రావాలంటూ పిలుపు ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి పంజాబ్‌, హ‌ర్యానా రాష్ట్రాల‌కు ఒక నీతి, ఇత‌ర రాష్ట్రాల‌కు మ‌రో నీతి ఉండ‌కూడ‌ద‌ని రాహుల్‌ గాంధీ’’ని విమర్శించారు.


దీంతో రంగంలోకి దిగిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి.. ట్విట‍్టర్‌ వేదికగా సీఎం కేసీఆర్‌కు, కవితకు కౌంటర్‌ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ ఏం చేసినా అది రాజకీయ లబ్ది కోసమే చేస్తోందన్న అర్థం కల్వకుంట్ల కవిత ట్వీట్ ద్వారా మరోమారు బయటపడిందని విమర్శించారు. దీంతో పాటు ఆయన ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘‘కవిత గారూ.. టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో పోరాటం చేయడం లేదు... సెంట్రల్ హాల్‌లో కాలక్షేపం చేస్తున్నారు. ఎఫ్‌సీఐకి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 ఆగస్టులో ఒప్పందంపై సంతకం చేసి తెలంగాణ రైతుల మెడకు ఉరితాడు బిగించింది కేసీఆరే అన్న విషయం మర్చిపోయారా!?’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles