30% individuals lose Covid vaccine immunity 6 months: Study కరోనా టీకా: ఆరునెలల్లో అదృశ్యమవుతున్న యాంటీబాడీలు..

30 people lose covid vaccine acquired immunity after 6 months study

asian institute of gastroenterology, booster dose, covid vaccines, covid-19, Coronavirus vaccine, coronavirus tests, immunity, Covid vaccine, Covid immunity, vaccine-acquired immunity, antibodies, healthcare workers, immune protection, medical conditions, hyderabad, telangana

A groundbreaking long-term study on a large pool of 1,636 healthcare workers, taken up by the Asian Institute of Gastroenterology (AIG), has indicated that with age, immunity levels against Covid also wane. About 30 per cent of the participants, a majority of them above 40 years of age with pre-existing medical conditions, lost vaccine-acquired immunity after six months. The study said that 6 per cent of the healthcare workers did not even develop any immune protection at all.

కరోనా టీకా: ఆరునెలల్లో అదృశ్యమవుతున్న యాంటీబాడీలు..

Posted: 01/20/2022 04:32 PM IST
30 people lose covid vaccine acquired immunity after 6 months study

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఆరు నెలల నుంచే రోగ నిరోధక శక్తి తగ్గిపోతోందని.. 30 శాతం మందిలో యాంటీబాడీల సంఖ్య పడిపోతోందని ‘ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ)’అధ్యయనంలో తేలింది. భారతీయులలో వ్యాక్సిన్‌తో వచ్చే రోగనిరోధక శక్తి ఎంత ఎక్కువ కాలం ఉంటుందన్న దానిపై ఏషియన్‌ హెల్త్‌కేర్‌ ఫౌండేషన్‌తో కలిసి ఏఐజీ ఇటీవల అధ్యయనం చేసింది. సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి బుధవారం ఈ వివరాలను వెల్లడించారు. పూర్తిగా రెండు డోసుల టీకాలు వేయించుకున్న 1,636 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ స్టడీ చేసినట్టు తెలిపారు.

‘‘దేశవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. అదృష్టవశాత్తూ వ్యాక్సినేషన్‌ ప్రభావం, వైవిధ్యం యొక్క అంతర్గత లక్షణం, జనాభాలో ఉన్న సహజ రోగనిరోధక శక్తి వంటి వివిధ కారణాలతో తీవ్రత స్వల్పంగా ఉంది. అయినా కూడా ఈ అంటువ్యాధి వ్యాప్తి తక్కువగా ఉండేలా, వీలైనంత ఎక్కువ మందిని రక్షించగల మార్గాలను అన్వేషించాల్సి ఉంది. ఆ కోవలోనే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల ప్రభావం ఎంతకాలం ఉంటుందో తేల్చడం, బూస్టర్‌ డోసులు అవసరమైన నిర్దిష్ట జనాభా గుర్తించడమే మా పరిశోధన లక్ష్యం’’అని నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.  

ఏఐజీ అధ్యయనంలో పాల్గొన్న 1,636 మంది లో 93% మంది కోవిషీల్డ్, 6.2 శాతం మంది కోవాగ్జిన్, 1% స్పుత్నిక్‌ తీసుకున్నవారు ఉన్నారు. ఈ అధ్యయన ఫలితాలు ఇతర ప్రపంచ అధ్యయనాల తో సరితూగేలా ఉన్నాయి. 6 నెలల తర్వాత దాదా పు 30% మంది రక్షిత రోగనిరోధకశక్తి స్థాయి 100 ఏయూ/ఎంఎల్‌ కంటే తక్కువస్థాయికి యాంటీబాడీలు తగ్గిపోయినట్టు గుర్తించారు. వీరిలో అధిక రక్త పోటు, మధుమేహం వంటి అనారోగ్యాలతో బాధపడుతున్న 40ఏళ్లు పైవయసువారే ఎక్కువగా ఉన్న ట్టు తేల్చారు. మొత్తంగా 6% మందిలో రోగనిరోధ క శక్తి అభివృద్ధి చెందలేదని గుర్తించారు. వయస్సు, రోగనిరోధకశక్తి క్షీణించడం అనేవి అనులోమానుపాతంలో ఉంటాయని ఫలితాలు సూచిస్తున్నాయని డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు.
చదవండి: మార్చికల్లా కరోనా మటాష్‌..! గుడ్‌ న్యూస్‌ చెప్పిన టాప్‌ సైంటిస్ట్‌

అంటే వృద్ధుల కంటే యువకుల్లో ఎక్కు వ యాంటీబాడీలు ఉంటాయని, వయసు పెరిగినకొద్దీ తక్కువ యాంటీబాడీలు ఉంటా యని వెల్లడించారు. రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్యాలతో బాధపడుతున్న 40 ఏళ్లు పైబడినవారిలో 6 నెలల తర్వాత యాంటీబాడీలు బాగా తగ్గిపోతున్నాయని.. అలాంటివారిలో కోవిడ్‌ ఎక్కువ ప్రభా వం చూపించే అవకాశం ఉందని తెలిపారు. వీరికి 6 నెలల తర్వాత బూస్టర్‌ డోసు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించా రు. ఇక 6 నెలలు దాటినా తగినంత యాంటీబాడీలు ఉన్న మిగతా 70% మందికి కూడా 9 నెలల విరామం తర్వాత బూస్టర్‌డోసు ఇవ్వడం వల్ల ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేశారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles