కరోనా మహమ్మారితో కుటుంబాలలోని ఆర్జించే వ్యక్తులతో పాటు తమ ఇంటి సభ్యులను కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిన కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచేందుకు పూనుకుంది. కరోనా బారిన పడి మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందించనుంది. తెలంగాణ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పరిహారంగా రూ.50వేల మత్తాన్ని అందించనున్నది. ఇప్పటికే మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో బాధిత కుటుంబాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ విపత్తుల నివారణ శాఖ మీ సేవ కేంద్రాల ద్వారా ఎక్స్గ్రేషియా కోసం బాధిత కుటుంబాల నుంచి దరఖాస్తులు కోరుతుంది. కరోనా బారిన పడి తమ కుటుంబసభ్యులు మరణించారని ధృవీకరించే పత్రాలతో అందజేయాలని తెలిపింది. కరోనాతోనే మృతి చెందినట్టు అధికారిక డాక్యుమెంట్, ఇతర ధ్రువీకరణపత్రాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,500 మీసేవా కేంద్రాల్లో ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆయా పత్రాలతో దరఖాస్తులు అందజేయాలని సూచించింది.
జిల్లా కలెక్టర్ చైర్మన్గా, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి సూపరింటెండెంట్లు సభ్యులుగా ఉండే కొవిడ్ డెత్ నిర్ధారణ కమిటీ కరోనా మరణానికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తుంది. మరిన్ని వివరాలకు 040-48560012 ఫోన్ నంబరులో, This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. మెయిల్లో సంప్రదించాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ కోరింది.
(And get your daily news straight to your inbox)
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more