Priyanka Gandhi promises free medical treatment up to ₹10 lakh రూ.10 లక్షల వరకూ ఉచితవైద్యం: ప్రియాంక గాంధీ

Uttar pradesh polls priyanka gandhi promises free medical treatment up to 10 lakh

U.P. Assembly polls, Yogi Adityanath, Priyanka Gandhi, Congress election sops, smart phones, e-Scooters, Congress women quote for UP polls, BJP, SP, BSP, RahulGandhi, freebies by Congress, vote bank politics, Uttar Pradesh Crime

Making another poll promise ahead of the Uttar Pradesh Assembly polls, Congress leader Priyanka Gandhi Vadra on October 25 said free medical treatment of up to ₹10 lakh will be provided to people of the State if her party government is voted to power.The Congress leader had flagged off her party's "Pratigya Yatras" from Uttar Pradesh's Barabanki district

ప్రియాంకా గాంధీ మరో ఎన్నికల హామీలు.. రూ.10 లక్షల వరకూ ఉచితవైద్యం..

Posted: 10/25/2021 03:07 PM IST
Uttar pradesh polls priyanka gandhi promises free medical treatment up to 10 lakh

వ‌చ్చే ఏడాది ఆరంభంలో జ‌రిగనున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌హిళ‌లు, యువతులు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల హామీలను కురిపించిన విషయం తెలిసిందే. ఇటీవల మహిళలకు తమ పార్టీలో 40 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. ఆ తరువాత ఇంటర్ పూర్తిచేసిన యువతులకు స్మార్ట్ ఫోన్లు, గ్యాడ్యూయేషన్ పూర్తి చేసిన యువతుల భద్రతకు ఈ స్కూటర్లు అందిస్తామని ప్రకటించిన కూడా తెలిసిందే. దీంతో ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ వైపు మహిళలు అకర్షితులవుతున్నారు.

తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎన్నికల హామీని నిలబెట్టుకుంటామని ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలో మహిళలకు, యువతులకు రక్షణ లేకుండా పోయిందని, మరీ ముఖ్యంగా దళితులు, వెనుకబడిన కులాలకు చెందిన యువతులు, మహిళలపై అకృత్యాలు జరగడమే ఇందుకు నిదర్శనమని.. బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి వారి బాధితులను, వారి కుటుంబసభ్యులను పరామర్శించి వచ్చిన ఆమె ఇవాళ ప్రధాన నరేంద్రమోడీ యూపీలో పర్యటిస్తున్న నేపథ్యంలో మరో కీలక ప్రకటన చేశారు. ప్రియాంక ప్రజల్లోకి నేరుగా వెళ్తున్న తరుణంలో అమె వారం రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు ప్రధాని యూపీలో పర్యటించడం గమనార్హం.

ఇక ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసీలో ప్రధాని మోడీ ఇవాళ ఏకంగా తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. సిద్ధార్ధ్‌న‌గ‌ర్‌, ఈటా, హ‌ర్దోయ్‌, ప్ర‌తాప్‌ఘ‌ఢ్‌, ఫ‌తేపూర్‌, దియోరియా, ఘ‌జీపూర్‌, మీర్జాపూర్‌, జాన్పూర్ జిల్లాల్లో 9 మెడిక‌ల్ కాలేజీల‌ను ప్ర‌ధాని ఈ సంద‌ర్భంగా ప్రారంభించారు. దీంతో పాటు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ను ప్రారంభించారు. జాతీయ అరోగ్య మిషన్ కు అధనంగా దీనిని ప్రారంభించారు. దీంతో పది రాష్ట్రాల్లోని ఏకంగా 17,788 గ్రామీణ అరోగ్య కేంద్రాలతో పాటు పట్టణ ప్రాంతంలోని వెల్ నెస్ కేంద్రాలకు కూడా దీని ద్వారా మద్దతు లభించనుంది.

ఈ నేపథ్యంలో ప్రధాని ఆరోగ్య మిషన్ కు ధీటుగా ప్రియాంక గాంధీ కూడా తన ఎన్నికల హామీని వెలువరించారు. తాము అధికారం చేప‌ట్ట‌గానే విద్యార్ధినుల‌కు స్మార్ట్‌ఫోన్లు, స్కూటీలు అందిస్తామ‌ని, రైతుల రుణాలు మాఫీ చేస్తామ‌ని, 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు యువ‌త‌కు అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని ప‌లు హామీలు గుప్పించిన ప్రియాంక గాంధీ తాజాగా మ‌రో కీల‌క వాగ్ధానం చేశారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే రూ 10 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉచిత వైద్య చికిత్స అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. కొవిడ్‌-19 బాధితుల‌కు ఊతంగా బాధిత కుటుంబానికి రూ 25,000 ప‌రిహారం ఇస్తామ‌ని ఆమె ఇప్ప‌టికే వెల్ల‌డించారు.  

స్వతంత్ర భారతావని మునుపెన్నడూ చూడని విధంగా ఇంధన ధరలు ప్రధాని నరేంద్రమోడీ హయాంలో విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వాహనదారులను ముప్పుతిప్పలు పెట్టిన ప్రభుత్వం ఏదైనా వుందా అంటే అది కేవలం ప్రధాని నరేంద్రమోడీదేనని ధ్వజమెత్తారు. దేశంలో స్వయం సంవృద్ది చెందాలని పెద్దలు స్థాపించిన అనేక పరిశ్రమలతో పాటు లక్షల కోట్ల రూపాయాల ప్రభుత్వ ఆస్తులను అమ్మకాలకు పెట్టిన ఘనత ఎవరదని అమె ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది నిరుద్యోగ యువత ఉపాధి కోసం వేచి చూస్తూ రోడ్డునపడ్డారని అవేదన వ్యక్తం చేశారు. మాటల్లో కోటలను దాటించడం కావాలా.? పనులు చేసే ప్రభుత్వాలు కావాలని అమె ఓటర్లను అలోచించుకోవాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles