Sarpanch thrashes Man for questioning on village issues సమస్యలపై ప్రశ్నిస్తే.. పిడుగుద్దులు.. బూటుకాలితో తన్నులు..

Sarpanch thrashes man for questioning on village issues and problems

damasthapur sarpanch jaipal reddy manhandles man, srinivas reddy beaten by sarpanch, sarpanch Jaipal Reddy thrashes Srinivas Reddy, jaipal reddy on village issues, sarpanch on village problems, Damasthapur village sarpasarpanch, Jaipal Reddy, Srinivas Reddy, village issues, village problems, Damasthapur village, Marpally Mandal, Vikarabad district, Telangana, Crime, Srinivas Reddy, village issues, village problems, Damasthapur village,Marpally Mandal, Vikarabad, Telangana, Crime, viral video, video viral, trending

In b Bizzare incident a Sarpanch from Damasthapur village of Marpally Mandal in Vikarabad district of Telangana thrashes man for questioning on the village issues, which were promised to be solved by the Jaipal Reddy at the time of Elections.

ITEMVIDEOS: సమస్యలపై ప్రశ్నిస్తే.. పిడుగుద్దులు.. బూటుకాలితో తన్నులు..

Posted: 09/22/2021 01:19 PM IST
Sarpanch thrashes man for questioning on village issues and problems

గ్రామస్థులకు ఉబ్బడిముబ్బడిగా ఎన్నికల హామీలను గుప్పించి.. గద్దెనెక్కిన తరువాత వారిని పట్టించుకోని నాయకులు ఎందరో. అయితే గ్రామవ్యవహారాల్లో పడి వాటిని మర్చిపోయాడని అనుకుని.. వాటిని గుర్తి చేయడంతో పాటు త్వరగా చేయాలని అభ్యర్థించిన ఓ గ్రామస్థుడిపై ఆ గ్రామ సర్పెంచ్ దాష్టికానికి దిగాడు. తాను గ్రామానికి సర్పంచ్ నన్న విషయం తెలిసి కూడా తనను ప్రశ్నిస్తావా అంటూ ఒంటికాలిపై లేచాడు. అంతటితో ఆగకుండా తన భార్య, కుమారుడి ఎదురుగానే అతనిపై పిడిగుద్దులు కురిపించాడు. కాలితో తన్నాడు.. చెప్పుతో కొట్టబోవడంతో స్థానికులు వచ్చి అడ్డుకున్నారు.

గ్రామ సమస్యలపై ప్రశ్నించడమేనా ఒక సామాన్యుడు చేసిన నేరం. సర్పంచ్‌ నన్న అహంభావం అతని నరనరాన పాకి.. సామాన్యులను బంట్రోతుల కన్నా అధ్వాన్నంగా చూసే నైజం తలకెక్కింది. గ్రామంలో తిష్టవేసిన సమస్యలను పరిష్కారించాలని కోరడం.. ఇప్పటికే పలుమార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహంతో ప్రశ్నిస్తే.. ప్రశ్నించిన వారిపై తిరగబడి ప్రతాపాన్ని ప్రదర్శిస్తారా.? అన్న ప్రశ్నలు కూడా గ్రామంలో వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజనుల నుంచి కూడా కామెంట్లు వస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. మార్పల్లి మండలం దామాస్తాపూర్ కు చెందిన శ్రీనివాస్‌ రెడ్డి అనే వ్యక్తి గ్రామంలోని డ్రైనేజీ సమస్యలను పరిష్కారించాలని స్థానిక సర్పంచ్‌ జైపాల్‌ రెడ్డిని కోరాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు సర్పంచ్‌ నన్నే ప్రశ్నిస్తావా? అంటూ శ్రీనివాస్‌ రెడ్డిపై పిడిగుద్దులు కురిపించాడు. అంతటితో ఆగకుండా అతడిని కిందపడేసి విచక్షణ రహితంగా కాలితో తన్నాడు. దీంతో బాధితుడు తనపై అకారణంగా దాడిచేసిన సర్పంచ్‌ జైపాల్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా, ఒక బాధ్యాతాయుత పదవిలో ఉండి అనుచితంగా ప్రవర్తించిన సర్పంచ్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles