Kabul Airport blast death toll rises to 103 కాబుల్ బాంబు దాడి: 103కు చేరిన మృతుల సంఖ్య.. గాల్లో ఎగిరిన శరీర అవయవాలు..

Death toll in kabul airport blasts rises to 103 is claims responsibility

Taliban, Afghanistan Crisis, Pentagon, Kabul, Afghanistan, Kabul airport, ISIS-K, Afghanistan-Taliban Crisis, afghan spies, afghanistan crisis, indians in afghanistan, Afghanistan, Afghanistan latest news, Taliban, Taliban latest news, Kabul, Kabul Airport, hindus in afghanistan, hindu temple in afghanistan, taliban, kabul, Devotional

At least 103 people were killed and over 143 were injured in four explosions that rocked Kabul. Multiple explosions were reported from outside the crowded Kabul airport. An eye-witness Adam Khan, said the explosion went off in a crowd of people waiting to enter the airport. Khan said several people appeared to have been killed or wounded, including some who lost body parts.

కాబుల్ బాంబు దాడి: 103కు చేరిన మృతుల సంఖ్య.. గాల్లో ఎగిరిన శరీర అవయవాలు..

Posted: 08/27/2021 01:35 PM IST
Death toll in kabul airport blasts rises to 103 is claims responsibility

ఆఫ్ఘ‌నిస్తాన్ ను తమ కబంధహస్తాలలోకి తీసుకున్న తాలిబన్లు.. అక్కడి ప్రజల్లో మాత్రం పాలకులుగా ముద్రవేసుకోలేకపోతున్నారు. తాలిబన్ల పాలనలో తాము ఉండలేమని అప్ఘన్ ప్రజలు తమ ఆస్తిపాస్తులను వదిలి విదేశాలకు పారిపోతున్నారు. తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాబుల్ విమానాశ్రయానికి చేరుకున్న లక్షలాది మంది అప్ఠన్ ప్రజలకు తాము ఉన్నామన్న భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలమైన తాలిబన్లు.. వారిపై భయాందోళనకు గురిచేసేలా తుపాకీ గుళ్లతో దాడులు చేస్తున్నారు. అయినా వాటిని తప్పించుకుని విమానాశ్రయానికి చేరుతున్న ప్రజలపై ఐసిస్ ఉగ్రవాదులు పగబట్టారు. ఆత్మాహుతి దాడులకు, పేలుళ్లకు పాల్పడ్డారు.

ఆఫ్ఘ‌నిస్థాన్ రాజ‌ధాని కాబూల్ గ‌త రెండు ద‌శాబ్దాల్లో ఎన్నో ఆత్మాహుతి దాడుల‌ను చూసింది. 20 ఏళ్ల కింద‌ట తాలిబ‌న్లు అధికారం కోల్పోయిన త‌ర్వాత ఇప్పటి వ‌ర‌కూ ఎన్నో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. కానీ గురువారం జ‌రిగిన ఆత్మాహుతి దాడి మాత్రం పెను విషాదాన్ని మిగిల్చింది. తాలిబ‌న్ల బారి నుంచి త‌ప్పించుకొని ఇల్లూవాకిలి వ‌దిలి వేరే దేశాల‌కు వెళ్లిపోవ‌డానికి ఎదురు చూస్తున్న వాళ్లు ల‌క్ష్యంగా ఈ దాడి జ‌ర‌గ‌డం మ‌హా విషాదం. అమెరికా మిలిట‌రీ కూడా గ‌త ప‌దేళ్లలో ఎన్న‌డూ చూడ‌ని ఉగ్ర‌దాడి ఇది. ఈ దాడిలో ఏకంగా 13 మంది అమెరికా సైన్యంతో పాటు అనేకమంది అప్ఘన్లు, తాలిబన్లు కూడా హతమయ్యారు. మృతుల సంఖ్య ఏకంగా 103కు చేరగా, క్షతగాత్రుల సంఖ్య కూడా 143కు చేరింది.

అయితే ఈ దారుణాన్ని ప్ర‌త్య‌క్షంగా చూసిన ఓ అప్ఘన్ జాతీయుడు అదామ్ ఖాన్.. ఆ భ‌యాన‌క దృశ్యాల గురించి వివ‌రించారు. ఆ వ్య‌క్తి అమెరికా ప్ర‌త్యేక ఇమ్మిగ్రెంట్ వీసా క‌లిగి ఉన్న అధికారి. గ‌తంలో ఓ ఇంట‌ర్నేష‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ గ్రూప్‌లో ప‌ని చేశారు. ఆఫ్ఘ‌నిస్థాన్ వదిలి వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న వేల మందిలాగే ఆ వ్య‌క్తి కూడా కాబూల్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎప్ప‌టిలాగే గురువారం ఉద‌య‌మే కాబూల్ ఎయిర్‌పోర్ట్ కు వ‌చ్చిన వేల మంది ఉన్న వ‌రుస‌లో నిల్చున్నారు. ప‌ది గంట‌ల పాటు అలా వేచి చూసిన త‌ర్వాత సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యంలో ఈ భారీ పేలుళ్లు జ‌రిగాయి.

ఆ పేలుడు త‌ర్వాత నా కాళ్ల కింద భూమిని ఎవ‌రో లాగేసిన‌ట్లు అనిపించింది. నా క‌ర్ణ‌భేరి ప‌గిలిపోయిందా అనుకున్నాను. కొంత‌సేపు ఏమీ వినిపించ‌లేదు. శ‌రీర భాగాలు టోర్న‌డోలో చిత్తు కాగితాల‌లాగే గాల్లోకి ఎగిరాయి. మృత‌దేహాలు, శ‌రీర భాగాలు, తీవ్రంగా గాయ‌ప‌డి సాయం కోసం వేడుకుంటున్న మ‌హిళ‌లు, పిల్ల‌లు, వృద్ధుల‌తో ఆ ప్రాంత‌మంతా భ‌యాన‌కంగా మారింది. నా జీవితంలో యుగాంతాన్ని చూస్తానో లేదో కానీ.. ఇవాళ అలాంటిదే చూశాను అని ఆ వ్య‌క్తి జ‌రిగిన దారుణాన్ని వివ‌రించారు.

గ‌త ఆఫ్ఘ‌న్ ప్ర‌భుత్వంలో హ‌యాంలో ఉన్న వ్య‌క్తి కావ‌డంతో తాలిబ‌న్ల‌కు భ‌య‌ప‌డిన త‌న పేరు చెప్ప‌డానికి నిరాక‌రించారు. పేలుడు త‌ర్వాత మృత‌దేహాల‌ను అక్క‌డి నుంచి త‌ర‌లించ‌డానికి, గాయ‌ప‌డిన వారిని హాస్పిట‌ల్స్‌కు తీసుకెళ్ల‌డానికి ఎవ‌రూ లేరు. అలా రోడ్డుపైన‌, ప‌క్క‌నే ఉన్న మురికి కాలువ‌లో ప‌డి ఉన్నారు. ఆ కాలువ‌లో నీళ్ల‌కు బ‌దులు ర‌క్తం పారుతోందా అనిపించింది. శారీర‌కంగా నేను బాగానే ఉన్నాను. కానీ ఈ పేలుడు చూసిన త‌ర్వాత మాన‌సికంగా నా జీవితం బాగుంటుందా లేదా అన్న‌ది మాత్రం తెలియ‌డం లేదు అని ఆ ప్ర‌త్య‌క్ష సాక్షి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles