Telangana to witness rain for 2 days అలర్ట్: తెలంగాణ రెండు రోజుల వర్షసూచన..

Weather forecast imd issues rain alert in these telangana districts

Rain logjam, houses drowned with rain water, rains in hyderabad, colonies flooded with Rain, telangana weather, low pressure, deep depression, andhra pradesh weather, rains in amaravati, weather report today, weather forecast, weather forecast today, Rain, low pressure, thunder storms, lightening, Bay of Bengal, weather forecast, Telangana, Andhra Pradesh

According to the Meteorological Department, low pressure occured in bay of bengal is likely to intenisfy to deep depression, as the cyclonic circulation has moved from the East Central Bay of Bengal to the places located at the center, which is 3.1 km above sea level.

అలర్ట్: తెలంగాణ రెండు రోజుల వర్షసూచన.. భారీ నుంచి అతిభారీ వర్షాలు

Posted: 08/16/2021 10:39 AM IST
Weather forecast imd issues rain alert in these telangana districts

తెలుగు రాష్ట్రాలపై వరుణుడు మళ్లీ కరుణించాడు. ఇప్పటికే తెలుగురాష్ట్రాలలో కురిసిన కుండపోతగా కురిసిన వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. అంతకుముందు కురిసిన వర్షాలతో వందల టీఎంసీల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. వరుణుడి మునుప్పెన్నడూ లేని విధంగా వర్షాకాలం ఆరంభంతో జూన్ మాసం నుంచి రాష్ట్ర ప్రజలపై ప్రేమ కురిపించాడు. దీంతో తెలుగురాష్ట్రాలలోని వాగులు వంకలు పొంగిపోర్లాయి. చెరువులు, కుంటలు, జలకళను సంతరించుకున్నాయి. జూలై నెలలో వర్షంతో తెలుగు రాష్ట్రాలను తడిసి ముద్దేచేసిన వరుణుడు.. కాసింత గ్యాప్ ఇచ్చి ఆగస్టు మాసంలోనూ దంచికోడుతుండటం వల్ల వర్షం ధాటికి తెలుగు రాష్ట్రాలు తల్లడిల్లుతున్నాయి,

తాజాగా భారత వాతావరణ శాఖ మరో చేధువార్తను చెప్పింది. రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో మళ్లి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలోని ఒడిశా తీరంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికి తోడు రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలలో నేడు, రేపు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో పాటు చురుగ్గా కదులుతున్న రుతుపవనాలతో రాగల 48 గంటల్లో తెలంగాణలో భారీ వర్షం కురిసే అవకాశాలు వున్నాయని తెలిపారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతలంలో పిడుగులు కూడా పడే అవకాశముందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోని క్రితం రోజున కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెంట్లంలో అత్యధికంగా 6.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాగా, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles