SC issues notices against producer C Kalyan సినీనిర్మాత సి.కల్యాణ్ కు సుప్రీంకోర్టు శ్రీముఖాలు

Supreme court issues notices against producer c kalyan in property row

Tollywood producer C Kalyan , C Kalyan, property row, Land Encroachment, Hafeezpet land, Hafizpet land issue, Supreme court, Hyderabad Police, Telangana

The Supreme Court on Wednesday issued notices against Tollywood producer C Kalyan and the State Government regarding the Hafeezpet Land. The apex court says the High Court has not issued final decree in this case.

సినీనిర్మాత సి.కల్యాణ్ కు సుప్రీంకోర్టు శ్రీముఖాలు

Posted: 07/01/2021 01:42 PM IST
Supreme court issues notices against producer c kalyan in property row

టాలీవుడ్ సినీ నిర్మాత సి.కల్యాణ్ అటు నిర్మాతగా కోనసాగుతూనే ఇటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ బిజీగా మారారు. అయితే ఆయనకు ఇప్పుడు టైం కలసివస్తున్నట్లు లేదు. రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఆయనపై భూ వివాదానికి సంబంధించిన కేసు నమోదుకాగా, ఇక వెనువెంటనే అటు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నుంచి కూడా శ్రీముఖాలను అందుకోవాల్సి వచ్చింది. షేక్ పేట్ పరిధిలోని తన స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి, తనను బెదిరిస్తున్నారంటూ ఫిలింనగర్ కు చెందిన గోపీకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయగా, షరూఫ్‌, తేజస్వి, శ్రీకాంత్ అనే ముగ్గురు వ్యక్తులతో పాటు నిర్మాత సి.కల్యాణ్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరో కేసులో ఆయనతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన రూలింగ్ సహేతుకంగా లేదని, ఫైనల్ డిక్రీ కూడా ఇవ్వలేదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేసు వివరాల్లోకి వెళితే, హైదరాబాదు శివారు హఫీజ్ పేటలోని సర్వే నంబర్ 80లో కొంత భూమి తనదని సి.కల్యాణ్ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఆయన ఆ భూముల్లో నిర్మాణాలు చేపట్టారు.

ఈ తీర్పును సవాల్ చేస్తూ హమీదున్నీసా బేగం, సెహెబ్బాదీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బుధవారం నాడు ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, నవీన్ సిన్హాలతో కూడిన ధర్మాసనం, ఫైనల్ డిక్రీ పొందకుండా కట్టడాలు ఎలా కడతారని ప్రశ్నించింది. కల్యాణ్ తరఫున న్యాయవాది శ్రీధర్ వాదనలు వినిపిస్తూ, ఫైనల్ డిక్రీ వచ్చిందని చెప్పారు. దీనిపై అసహనాన్ని వ్యక్తం చేసిన ధర్మాసనం, ఫైనల్ డిక్రీ ఇవ్వలేదని హైకోర్టు తీర్పులో స్పష్టంగా ఉందని గుర్తు చేసింది. ఈ విషయంలో స్పందించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి, కల్యాణ్ కు నోటీసులు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : C Kalyan  property row  Land Encroachment  Hafeezpet land  Supreme court  Hyderabad Police  Telangana  

Other Articles