Japan introduces four-day working week to increase productivity జర్మనీ బాటలో జపాన్.. వారానికి 4 పనిదినాలు..

Japan pushes for four day workweek to give employees free time

Japan, Coronavirus, four-day working week, Martin Schulz, chief policy economist, increase in productivity, Germany, corporate companies, MNCs

Japan is pushing employers to cut down the working week to four days as part of a series of new economic guidelines. The country’s corporate culture is notoriously intense and karoshi, a term meaning “death from overwork”, was coined in Japan in the 1970s due to the onerous work pressures employees face.

జర్మనీ బాటలో జపాన్.. వారానికి 4 పనిదినాలు..

Posted: 06/26/2021 02:47 PM IST
Japan pushes for four day workweek to give employees free time

ప్రపంచవ్యాప్తంగా పలు బహుళజాతి సంస్థలతో పాటు కార్పోరేట్ సంస్థలు తమ ఉద్యోగులను పనిదినాల్లో తీవ్ర ఒత్తిడికి గురిచేసినా.. ఆ ఒత్తిడి నుంచి సేద తీరడానికి కేవలం వారానికి ఐదు రోజులే పనిదినాలుగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే జర్మనీకి చెందిన ఉద్యోగులకు అక్కడి సంస్థలు సరికొత్త వెసలుబాటు తీసుకురాగా, అక్కడి ప్రభుత్వం కూడా అందుకు సమ్మతించింది. ఇక్కడ వారానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పనిదినాలు. అయితే ఇక్క ఉద్యోగులు మాత్రం పనిదినాల్లో 8 గంటలకు బదులుగా పది గంటలు పనిచేయాల్సి వుంటుంది. దీంతో వారానికి మూడు రోజులు వీరికి సెలువులు లభిస్తాయి.

అందుకు అనుగూణంగా జర్మనీ ప్రభుత్వం ఉద్యోగ విధుల పనిగంటలు.. విరామ దినాల విషయంలో మార్పులు చేసింది. అయితే ఇది అన్ని సంస్థలకు వర్తింపజేయలేదు. ఇక జర్మనీ బాటలోనే జపాన్ కూడా పయనిస్తోంది. జపాన్ ప్రభుత్వం కూడా సంచలనాత్మక రీతిలో వారానికి నాలుగు రోజులే పనిదినాలు అంటూ కీలక సిఫారసులు చేసింది. కుటుంబం, ఉద్యోగం మధ్య వ్యక్తులు సమతుల్యత సాధించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని జపాన్ ప్రభుత్వం భావిస్తోంది. జనాభా పెరుగుదల లేకపోవడం జపాన్ లో ఓ సమస్య. అధిక పనిగంటల ఒత్తిడితో కుటుంబ సభ్యులు కలుసుకునే సమయం తగ్గిపోతోందని జపాన్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

నాలుగు రోజుల పనిదినాలను అమలు చేస్తే, ఉద్యోగులు తమ కుటుంబంతో గడిపేందుకు అత్యధిక సమయం లభిస్తుందని, తద్వారా మానసికంగా ఉద్యోగులు ఎంతో తాజాగా ఉండేందుకు వీలవుతుందని భావిస్తోంది. ఈ మేరకు ప్రైవేటు సంస్థలకు ప్రతిపాదనలు చేసింది. నాలుగు రోజుల పనిదినాలు మినహాయించి మిగిలిన ఖాళీ సమయంలో ఉద్యోగులు తమ నైపుణ్యాలు పెంచుకునే వీలుంటుందని, ప్రజలు హాయిగా తిరుగుతూ షాపింగ్ చేస్తే ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటుందని జపాన్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక, పెళ్లికాని వారైతే ఈ ఖాళీ సమయంలో పెళ్లి ఆలోచనలు చేసి, తగిన భాగస్వామిని వెదికి జీవితంలో స్థిరపడతారని, తద్వారా జనాభా పెరిగేందుకు ఇదొక మార్గం అవుతుందని తలపోస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles