‘‘Jagan Reddy rewarding co-accused, cancel his bail’’ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ జులై 1కి వాయిదా..

Jagan reddy rewarding co accused cancel his bail rebel ysr cong mp to court

YS Jagan Bail Cancel case, YS Jagan Disappropriate assets case, Raghurama KrishnaRaju Rejoinder, Narsapuram MP Raghuramakrishna raji, YS Jagan, AP CM, Disappropriate assets case, Raghurama KrishnaRaju, Narsapuram MP, Bail cancel petition, Andhra Pradesh, Politics

YSR Congress MP K Raghurama Krishnam Raju, who has taken on Andhra Pradesh chief minister YS Jagan Mohan Reddy in court, was accused of sedition weeks after he filed his application for revoking the chief minister’s bail request.

జగన్ బెయిల్ రద్దు కేసులో రిజాయిండర్ దాఖలు చేసిన రఘురామ

Posted: 06/14/2021 02:09 PM IST
Jagan reddy rewarding co accused cancel his bail rebel ysr cong mp to court

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్ర‌మాస్తుల కేసులో పోందిన బెయిలును రద్దు చేయాలంటూ వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్ పై ఇవాళ నాంప‌ల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిష‌న్ పై ఇప్ప‌టికే జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు 98 పేజీల కౌంట‌ర్ దాఖ‌లు చేస్తూ పసలేని పిటీషన్ ను కొట్టేయాల‌ని కోరిన విష‌యం తెలిసిందే. అయితే, ఆ కౌంట‌ర్ పై ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఇవాళ రిజాయిండ‌ర్ దాఖ‌లు చేశారు. కౌంట‌ర్ లో వైఎస్ జ‌గ‌న్ అస‌త్య‌పు ఆరోపణ‌లు చేశార‌ని తెలిపారు. త‌న‌కు పిటిష‌న్ వేసే అర్హ‌త లేద‌న‌డం అసంబ‌ద్ధ‌మ‌ని తెలిపారు.

తనతో పాటు అక్రమాస్థుల కేసులో వున్న సహనిందితులకు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత లబ్ది చేకూర్చే పనులను చేస్తూ వారిని ప్రభావితం చేస్తున్నారని రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన రిజాయిండర్ లో పేర్కోన్నారు. ఈ మేరకు ఇవాళ న్యాయస్థానంలో దాఖలు చేసిన అఫిడెవిట్ లో ఆయన వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల్లో వున్న పలువురు నేతల పేర్లను ఊటంకిస్తూ వారికి ఆయన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేకూర్చిన లబ్దిని కూడా పోందుపర్చారు. జగన్ అక్రమాస్థుల కేసులో సహ నిందితుడిగా ఓ కేసులో వున్న సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా పదవిని కల్పించారని ఆయన తన రిజాయిండర్ అఫిడెవిట్ లో పేర్కోన్నారు.

అంతేకాదు సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రభుత్వ అధికారులతో పాటు పోలీసులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకునే అధికారాన్ని జగన్ ప్రభుత్వం అందించారని పేర్కోన్నారు. ఇక అక్రమ కేసుల వ్యవహారంలో పార్టీ నేత మోపిదేవి వెంకటరమణను ముందుగా రాష్ట్ర మంత్రిగా ఏర్పాటు చేశారని, ఆ తరువాత ఆయనను రాజ్యసభకు పంపుతూ ప్రమోట్ చేశారన్నారు. ఇక మరో సహ నిందితుడైన వైవి సుబ్బారెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని కట్టబెట్టారని పేర్కోన్నారు. ఇక జగన్ అక్రమాస్థులలో సాక్షులుగా వున్న అధికారులకు ఏడాది పూరైన నేపథ్యంలో ఇచ్చే అప్రైసల్ విషయంలోనూ పలు మార్పులు చేయడంతో వారిని కూడా ప్రభావితం చేస్తున్నారని ఆయన అఫిడెవిట్ లో పేర్కోన్నారు.

పిటిష‌న్ విచార‌ణ అర్హ‌త‌ల‌పై కోర్టులు ఇప్ప‌టికే స్ప‌ష్ట‌త‌నిచ్చాయ‌ని వివ‌రించిన ఆయన.. తనపై ఉన్న సీబీఐ కేసులను ప్రస్తావించలేదని జ‌గ‌న్ పేర్కొనడం స‌రికాద‌న్నారు. త‌న‌పై కేవ‌లం ఎఫ్ఐఆర్ లు న‌మోద‌య్యాయ‌ని, చార్జిషీట్ దాఖ‌లు చేయ‌లేద‌ని ఆయ‌న వివరించారు. జ‌గ‌న్ ఆరోప‌ణ‌లు దెయ్యాలు వేదాలు వ‌ల్లించి‌న‌ట్లు ఉంద‌ని పేర్కొన్నారు. కాగా, వాద‌న‌ల‌కు స‌మ‌యం ఇవ్వాల‌ని జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టును కోరారు. దీంతో జులై 1కి విచార‌ణ‌ను వాయిదా వేస్తున్న‌ట్లు సీబీఐ కోర్టు ప్ర‌క‌టించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles