Covid drug: Natco eyes patent waiver కరోనా రోగులకు ఊరట కల్పించనున్న నాట్కో ఫార్మా

Natco rolls out baricitinib ahead of approval for patent waiver

USFDA, trips, patent, NATCO, covid drug, covid-19, Baricitinib, rheumatoid arthritis drug, Natco Pharma, generic version Baricitinib

Even as it has filed for a compulsory licence for Covid-19 drug Baricitinib in India, Natco Pharma has already begun rolling out its generic version of the rheumatoid arthritis drug under the Barinat brand. Natco launched its 4mg tablets at Rs 30 a piece and stocks of the drug are already in the market.

కరోనా రోగులకు ఊరట కల్పించనున్న నాట్కో ఫార్మా

Posted: 05/07/2021 10:18 AM IST
Natco rolls out baricitinib ahead of approval for patent waiver

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మానవత్వంతో ముందుకువచ్చిన ఫార్మ సంస్థతో బాధితులకు ఊరట కలగించే వార్తను అందించింది. కరోనా మహమ్మారి బారినపడి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రుల్లో చేరే రోగుల్లో కనిపించే ‘సైటోకైన్ స్ట్రామ్’ ముప్పును ‘బారిసిటినిబ్’ ఔషధం సమర్థంగా ఎదుర్కొంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ట్యాబ్లెట్ ధర రూ. 3,300 వరకు ఉంటుంది. రోజుకు రెండు చొప్పున మొత్తం 14 ట్యాబ్లెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో బాధితుడు రూ. 46 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ట్యబ్లెట్లపై మన దేశంలో ఎలి లిల్లీ అనే బహుళజాతి ఫార్మా కంపెనీకి పేటెంట్ ఉంది.

కాగా, ఇప్పుడీ ట్యాబ్లెట్లను అత్యంత చౌకగా అంటే ఒక్కో దానిని కేవలం రూ.30కే అందించేందుకు నాట్కో ఫార్మా ముందుకొచ్చింది. మొత్తం డోసును రూ. 420కే అందిస్తామని పేర్కొంది. ఈ ట్యాబ్లెట్లను తయారు చేసేందుకు ‘వాలంటరీ లైసెన్స్’ ఇవ్వాలని గతేడాది డిసెంబరులో ఎలి లిల్లీని నాట్కో ఫార్మా కోరింది. అయితే, ఆ సంస్థ నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో ‘కంపల్సరీ లైసెన్సింగ్’ కోసం ముంబైలోని కంట్రోలర్ ఆఫ్ పేటెంట్స్‌కు దరఖాస్తు చేసింది. బారిసిటినిబ్ ఔషధానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో)  నుంచి నాట్కో ఇప్పటికే అత్యవసర వినియోగ అనుమతి (ఈయూఏ) సంపాదించింది. నాట్కోకు కంపల్సరీ లైసెన్స్ లభిస్తే కనుక కరోనా రోగులకు బోల్డంత ఊరట లభించినట్టే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : USFDA  patent  NATCO  covid drug  covid-19  Baricitinib  

Other Articles