Reckless biker triggers truck collision In Hyderabad వెంట్రుకవాసిలో తప్పించుకున్న బైకర్.. రెండు లారీలు ఢీ

Reckless biker triggers truck collision in himayath sagar of hyderabad

biker negligence, Reckless Two Wheeler, himayat sagar, Rajendranagar, Gandhi nagar chowrasta, lorries collide, RangaReddy, Telangana, Crime

Even after repeated instructions from Traffic police of Hyderabad, cyberabad, Rachakonda there are few neglected bikers who make their co passemgers feel incomfort and scary on road with their negligent driving. here is one such video doing rounds online.

ITEMVIDEOS: వెంట్రుకవాసిలో తప్పించుకున్న బైకర్.. రెండు లారీలు ఢీ

Posted: 03/30/2021 03:56 PM IST
Reckless biker triggers truck collision in himayath sagar of hyderabad

రోడ్డుపైకి వచ్చేవారు ఓసారి ఇరువైపులా చూసుకున్న మాత్రమే రావాలని.. చిన్నతనం నుంచే పాఠ్యాంశాలలో చేర్చారు. చదివిన చదుపు మార్కులకే పరిమితం అవుతాయని .. పెదయ్యాక మరోమారు గుర్తు చేస్తారు ఆర్టీఏ అధికారులు. వాహనాలను నడుపేందుకు డ్రైవింగ్ లైన్సెన్స్ తీసుకునే క్రమంలోనూ అన్ లైన్ లో ప్రశ్నలకు సమాధానాలు చెప్పే క్రమంలో ఈ నిబంధనలు కూడా అడుగుతారు. అన్నింటికీ సరిగ్గా సమాధానాలు చెప్పిన తరువాతే లైస్సెన్సులను అధికారులు జారీ చేస్తారు. అయితే వాహనం ఎక్కేంత వరకు వున్న నిబద్దత.. వాహనం ఎక్కిన తరువాత మాత్రం ఎందుకు వుండదో అర్థం కాదు.

లైస్సెన్సు లేకుండానే వాహనాలను ఎక్కుతున్నారో తెలియదు కానీ.. ఒకరి నిర్లక్ష్యం వల్ల రెండు భారీ వాహనాలు ఢీకొని పెను ప్రమాదానికి దారి తీసిన ఘటన చోటుచేసుకుంది. అంతా యాధృశ్చికం అనుకున్నాడో లేక తన అదృష్టం అని భావించాడో తెలియదు కానీ.. ప్రమాదం జరిగిందని తెలిసినా.. కనీస మానవత్వం లేకుండా.. వారిని అసుపత్రులకు తరలించాలనో లేక 108కు సమాచారం అందించాలనో కూడా ప్రయత్నించకుండా అక్కడి నుంచి మెల్లిగా జరుకున్నాడు. దీంతో ఈ పెనుప్రమాదానికి కారణమైన వాహనదారుడి కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది.

స్థానికంగా వున్న సిసిటీవీ ఫూటేజీలను పరిశీలించిన పోలీసులకు తప్పు లారీ డ్రైవర్లది కాకపోయినా.. వారు తీవ్రగాయాలపాలయ్యారని తెలుసుకున్నారు. అసలేం జరిగిందంటే.. స్థానికంగా వున్న ఓ కూడలి వద్ద ఓ వైపునున్న గల్లీ నుంచి ఓ ద్విచక్రవాహనదారుడు వస్తూ రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. అయితే అదే సమయంలో అయకు వెనుకగా ఓ లారీ వచ్చింది. దీంతో లారీ డ్రైవర్ ద్విచక్రవాహనదారుడ్ని తప్పించేందుకు చేసిన ప్రయత్నం పెను ప్రమాదానికి కారణమైంది. బైక్ ను తప్పించేందుకు సడన్ బ్రేక్ వేసినా.. వేగాన్ని ఒక్కసారిగా అపలేకపోవడంతో కూడలి వద్ద కుడిపైకుకు తిప్పాడు.

అదే సమయంలో కుడివైపు నుంచి వేగంగా వస్తున్న మరో లారిని ఢీకొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటనలో కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన వెంకటరాముడు (50), క్లీనర్ శివ (30) తో కలిసి లారీలోహిమాయత్ సాగర్ నుంచి రాజేంద్రనగర్ వైపు వస్తున్నారు. అదే సమయంలో రాజేంద్రనగర్ నుంచి హిమాయత్ సాగర్ వైపు కంకరలోడుతో ఓ టిప్పర్ వేగంగా వస్తోంది. ఈ క్రమంలో గాంధీనగర్ చౌరస్తా వద్దకు రాగానే అకస్మాత్తుగా ఓ ద్విచక్రవాహనదారుడు రోడ్డుపైకి వచ్చాడు. రోడ్డకు పై కూతవేటు దూరంలో వేగంగా వస్తున్న లారీకనబడుతున్నా.. తనకేమీ పట్టనట్టు తాపీగా రోడ్డుపైకి వచ్చేశాడు.

ఇది గమనించిన టిప్పర్ డ్రైవర్ తిరుపతయ్య ద్విచక్రవాహనదారుడ్ని తప్పించే ప్రయత్నంలో తన వాహనాన్ని క్షణాల్లోనే కూడలి వద్ద కుడివైపుకు మళ్లించాడు. అదే సమయంలో అటునుంచి వేగంగా వస్తున్న లారీని టిప్పర్ ఢీకొట్టింది. దీంతో వాహనాలు రెండూ రోడ్డు పక్కన బోల్తాపడ్డాయి. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయిన టిప్పర్ డ్రైవర్ వెంకటరాముడు, శివ తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఒక్కసారిగా లారీ ఎందుకు ఇటు వైపు మళ్లిందని చూసేవారు భావిస్తున్నారే కానీ.. ఎంట్రుకవాసిలో బైకర్ తన ప్రాణాలను నిలుపుకున్నాడన్న విషయం సిసిటీవీ ఫూటేజీని పరిశీంచడంతోనే బయటపడింది. దీంతో బైకర్ అచూకీ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles