Rahul Gandhi: Modi govt cannot build, can only sell ‘‘వాళ్లకి నిర్మించడం తెలియదు.. అమ్మడమే తెలుసు’’

Rahul gandhi slams centre over plans to sell residual stake in 4 airports

Rahul Gandhi, Narendra Modi, Bharatiya Janata Party (BJP), Indian National Congress (Congress), Privatisation of Airports, Crony Capitalists, Public Sector Units, Indian Economy, Business, Finance

Rahul Gandhi suggested the PM Modi government knew only to sell, not to build, attacking the Centre’s privatisation drive that he said hurt the public and helped only crony capitalists. “Banana nahin, sirf bechna jaanta hai (Can’t build, knows only to sell),” Rahul tweeted.

‘‘వాళ్లకి నిర్మించడం తెలియదు.. అమ్మడమే తెలుసు’’: బీజేపిపై రాహుల్ ఫైర్

Posted: 03/16/2021 12:09 PM IST
Rahul gandhi slams centre over plans to sell residual stake in 4 airports

దేశంలో పబ్లిక్ సెక్టార్ యూనిట్లతో పాటు విమానాశ్రయాల్లో ఉన్న కొద్దిపాటి వాటాను కూడా కేంద్రం వదులుకునేందుకు సిద్దంగా ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని పరోక్షంగా తూర్పారబట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశాన్ని నిర్మిస్తామని అంటూ ప్రచారం చేసిన పార్టీ.. తన నిజస్వరూపాన్ని ఇలా బయటపెట్టిందని ఆయన విమర్శించారు. అసలు ఈ ప్రభుత్వానికి దేశంలో ఏదైనా నిర్మించడం వచ్చా.? గత ఏడేళ్లుగా ఈ ప్రభుత్వం నిర్మించిన కర్మాగారాలు, పరిశ్రమలు ఏమైనా వున్నాయా.. అని ఆయన ప్రశ్నించారు.

ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాదుల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఉన్న కొద్దిపాటి వాటాను పూర్తిగా విక్రయించాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం వ్యాపారం చేయాల్సిన అవసరం లేదని ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అన్న మాటలను పరోక్షంగా విమర్శించిన రాహుల్ గాంధీ.. భారత్ దేశం పూర్తి ప్రైవేటీకరణకు వ్యతిరేకమని అన్నారు. ఈ నిర్ణయాలతో దేశ ప్రజలకు శాపాలుగా పరిణమిస్తాయని, అయితే అదే సమయంలో ప్రభుత్వానికి అండగా నిలిచిన గుప్పుడు మంది పెట్టుబడిదారులకు మాత్రం లాభాలను అర్జించిపెడతాయని అన్నారు.

మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎలా నిర్మించాలో తెలియదు కానీ, ఎలా విక్రయించాలో మాత్రం బాగా తెలుసంటూ ట్వీట్ చేశారు. అన్నీ ప్రైవేటీకరించడం ద్వారా ప్రజల ప్రయోజనాలు దారుణంగా దెబ్బతింటాయని, అదే సమయంలో మోదీ ఆప్తమిత్రులు లబ్ధి కలుగుతుందని అన్నారు. ఈ ట్వీట్ కు రాహుల్ #indiaagainstprivatisation అనే హ్యాష్ టాగ్ ను జోడించారు. ఈ క్రమంలో 2014 సార్వత్రిక ఎన్నికలలో ఆయనపై రాసిన పాటను కాంగ్రెస్ ఊటంకించింది. ఈ దేశం మట్టిపై ప్రమాణం చేసి చెబుతున్నాను.. దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమ్మనివ్వని అన్న చరణాన్ని పొందుపర్చింది. అంతేకాదు దీనికి ఏది దొరికితే అది అమ్మేసే సేల్స్ ఏజెంట్ ఆయన అంటూ పరోక్షంగా మోడీని టార్గెట్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles