No new Rs 2,000 notes printed since 2019: MoS రెండేళ్లుగా రూ.2000 నోటును ముద్రించని కేంద్రం

Rs 2 000 currency notes not printed in last two years government in lok sabha

MDMK MP, Avinashi Ganeshamurthi, Minister of State for Finance, Anurag Thakur, 2000 Rupee,Anurag Thakur,Currency printing,Rs 2000 currency note,Rs 2000 currency note available?,Rs 2000 notes,Rs 2000 notes circulation,Rs 2000 notes not printed,Rs 2000 notes printing,Rs 2000 notes volume,banknote printing,currency notes,notes in circulation,printing of Rs 2000 notes

Responding to a question posed in Lok Sabha by MDMK MP Avinashi Ganeshamurthi, Minister of State for for Finance Anurag Thakur said that no indent had been placed with the presses for printing of 2000 Rupee denomination banknotes during 2019-20 and 2020-21.

రెండేళ్లుగా రూ.2000 నోటును ముద్రించని కేంద్రం

Posted: 03/15/2021 09:46 PM IST
Rs 2 000 currency notes not printed in last two years government in lok sabha

2016 నవంబర్ 8న అప్పటి పెద్దనోట్లు రద్దు చేసిన నరేంద్రమోడీ ప్రభుత్వం.. ఆ వెనువెంటనే అంతకుమించిన పెద్ద నోటును చెలామణిలోకి తీసుకువచ్చి అప్పుడే ఐదేళ్ల కాలం కావస్తోంది. అయితే 2016లో అత్యధికంగా కనిపించిన ఈ నోట్లు.. ఆ తరువాత క్రమంలో చలామణిలో లేకుండా పోయాయి. మరీ ముఖ్యంగా మినీభారత్ ఎన్నికల సమయంలో ఈ నోట్లు కనిపించడం లేదంటూ పార్లమెంటులో ఎంపీలు ప్రశ్నలు కురిపించగా.. లేదు అన్ని చలామణిలోనే వున్నాయని, అయితే పెద్దనోట్లు ప్రజలు దాచుకోవడం వల్లే ఆ నోట్లు చలామణిలో తక్కువగా కనిపిస్తున్నాయని అప్పటి అర్థికమంత్రి అరుణ్ జైట్లీ కూడా వ్యాఖ్యానించారు.

ఇక ఈ నోటు చలామణిలోకి వచ్చినప్పటి నుంచి ఓ సారి అవును.. ఓ సారి కాదు అన్నట్టుగా ఈ నోటును కూడా రద్దు చేస్తారన్న లీకులు రావడం.. కాదని కేంద్రం స్పష్టం చేయడం.. దీంతో ఈ నోట్లను పేదలు, మధ్యతరగతి వారు తమ వద్ద నిలువ ఉంచుకోవాలన్నా భయపడాల్సిన సరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. అయితే ఈ లీకులు, క్లారిటీత మధ్యలో ఈ నోట్లను కుప్పలు తెప్పులుగా బడాబాబులు సమీకరించి.. తమ ఖజానాల్లో దాచుకున్నారని అరోపణలు కూడా వున్నాయి. అయితే తాజాగా ఈ నోటు మళ్లీ చలామణిలో కనిపించకుండా పోయిందని ఓ ఎంపీ పార్లమెంటులో ప్రశ్నించారు.

దీంతో ఈ విషయమై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చారు. నోట్ల ర‌ద్దు త‌ర్వాత తొలిసారి చలామణిలోకి వచ్చిన రూ.2000 నోటు ముద్రణను గత రెండేళ్లుగా నిలపివేసినట్లు అధికారికంగా వెల్లడించారు. గ‌త రెండేళ్లుగా రూ.2000 నోటును ముద్రించ‌డం ఆపివేసినట్లు సోమవారం జరిగిన లోక్‌సభ సమావేశాల్లో ఆయన కేంద్రం ప్రకటించారు. 2018, మార్చి 30నాటికి మొత్తం 336.2 కోట్ల రూ.2000 నోట్లు చెలామ‌ణిలో ఉన్నాయని, 2021, ఫిబ్రవ‌రి 26 నాటికి వీటి సంఖ్య 249.9 కోట్లకు త‌గ్గింద‌ని మంత్రి పేర్కొన్నారు. లావాదేవీల డిమాండ్ మేర‌కు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటుంద‌ని మంత్రి తెలిపారు. కాగా, న‌ల్లధ‌నానికి అడ్డుక‌ట్ట వేసే ఉద్దేశంతో 2016లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను ర‌ద్దు చేసి రూ.2000 నోటును చలామణిలోకి తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles