Platform ticket price hiked from Rs 10 to Rs 30 ఫ్లాట్ ఫాం చార్జీలు రూ.30 పెంపుపై రైల్వేశాఖ వివరణ

After raising platform ticket prices to rs 30 railways issues clarification on hike

Indian Railways, Platform ticket, Platform ticket price, Platform ticket price hike, Ticket Price, COVID-19 pandemic, Overcrowding, DRM Railway, Ministry of Railways, train tickets, special trains, special train charges, special train tickets price

The Indian Railways have announced a fare hike for platform tickets across its network. The fresh notification by the railways stated that the platform ticket price has been increased from Rs 10 to Rs 30. The present increase in platform ticket prices at some stations is a 'temporary' measure to prevent the spread of COVID-19 through crowding.

ఫ్లాట్ ఫాం చార్జీలు రూ.30 పెంపుపై రైల్వేశాఖ వివరణ

Posted: 03/06/2021 12:42 PM IST
After raising platform ticket prices to rs 30 railways issues clarification on hike

యావత్ ప్రపంచ దేశాల అర్థిక పరిస్థితులను కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసిన నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు గత ఏడాది జూన్ లో ఏర్పడిన అన్ లాక్ నుంచి ప్రతీ అంశంలో ధరాఘాతాన్ని ప్రజలు చవిచూస్తున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకులు, పాలు,రవాణా, రైలు ప్రయాణాలు ఇలా ఒక్కటని కాదు.. ఎందెందు వెతికినా ధరాఘాతం కనిపించు అన్న నానుడి ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో కరెక్టుగా అన్వయం చేసుకునేలా వుంది. ఇక ఈ దెబ్బతో రైళ్లను ప్రవేటుపరం చేయాలన్న అలోచనలతో వున్న కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ అస్త్రంగా మారింది.

కరోనా సమయంలో మహమ్మారి నియంత్రణకు దేశంలోని రైల్వే వ్యవస్థను పూర్తిగా రద్దు చేసిన కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ.. ఇక అన్ని వ్యవస్థలపై నియంత్రణను వదిలేసినా.. కేవలం రైల్వే, విదేశీయానం ప్రయాణాలపై మాత్రం ఇంకా నియంత్రణ విధించింది. ఈ క్రమంలో దేశంలోని పలు మార్గాలలో ప్రత్యేక రైళ్లను నడుపుతూ.. సాధారణ వేళ్లలో తీసుకునే చార్జీలకన్న అధికంగా చార్జీలను వసూళు చేస్తూ.. ప్రజలకు భారం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే టికెట్లను కూడా కేవలం అన్ లైన్ లో తీసుకోవాలని మెలిక పెట్టిన కేంద్రరైల్వే మంత్రిత్వ శాఖ అన్ లైన్ బుకింగ్ నేపథ్యంలో ఇంటర్ నెట్ చార్జీల రూపంలో మరో రూ.15 అదనంగా బాదేస్తోంది.

సాధారణ వేళల్లో టు సిట్టింగ్ టిక్కట్ ధరలు కేవలం పది నుంచి ప్రారంభం అవుతుండగా, కరోనా నెపంతో ఈ చార్జీలను కూడా భారీగా పెంచేసి.. సామాన్యుల అవసరాలనే అస్త్రంగా చేసుకుని ఎడాపెడా చార్జీలతో వాయిస్తోంది కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ. ఈ ప్రయాణాలపై దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో వున్న ప్రాంతానికి సాధారణ సమయంలో రూ.15తో ప్రయాణించే వెసలు బాటు కాస్తా.. ఇప్పుడు ఏకంగా రూ.45 నుంచి రూ.75 వరకు చేరింది. ఇక దీనికి మరో పదిహేను రూపాయల అదనపు అంతర్జాల చార్జీ. వెరసి.. రూ.15 ప్రయాణాలకు పేద, మధ్యతరగతి వారు ఏకంగా రూ.100 ఖర్చచేయాల్సి వస్తోంది.

ఇది చాలదన్నట్టు తాజాగా రైల్వే స్టేష‌న్ల‌లో ప్లాట్‌ఫాం టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుతూ రైల్వే శాఖ నిర్ణ‌యం తీసుకుంది.  ఇప్ప‌టి వ‌రకు ఆ టికెట్ ధ‌ర‌ రూ.10గా ఉంది. రైల్వేశాఖ ఒకేసారి రూ.20 పెంచి ఆ టికెట్ ధ‌ర‌ను రూ.30గా నిర్ణ‌యించింది. పెంచిన ధ‌ర‌ల‌ను వెంట‌నే అమ‌ల్లోకి తీసుకురావాల‌ని అన్ని జోన్ల‌నూ ఆదేశించింది.  ప్లాట్‌ఫాం టికెట్ తీసుకున్న వారు రెండు గంట‌ల పాటు ప్లాట్‌ఫామ్‌పై ఉండ‌వ‌చ్చు. మ‌రోవైపు, లోక‌ల్ రైళ్ల టికెట్ల‌ను కూడా భారీగా పెంచుతూ రైల్వే శాఖ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. లోక‌ల్ రైళ్ల‌లో క‌నీస చార్జీ రూ.30గా నిర్ణ‌యించారు. దేశంలో క‌రోనా విజృంభ‌ణ పెరిగిపోతోన్న నేప‌థ్యంలో అన‌వ‌స‌ర ప్ర‌యాణాల‌కు అడ్డుక‌ట్ట వేయ‌డానికి చార్జీల‌ను పెంచుతున్న‌ట్లు రైల్వే శాఖ చెప్పుకొచ్చింది. లోక‌ల్ రైళ్లు, ప్లాట్‌ఫాం‌పై ఎక్కువ మందిని ప్రోత్స‌హించ‌కుండా ఉండ‌డం కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles