Lawyer couple accused talk with supari gang goes viral govt న్యాయవాది హత్యకు కుంటా శ్రీనివాస్ సుపారీ

Leaked audio talk between accused and supari gang leader going viral

Murder, Lawyer Couple, Telangana High Court, Chief Justice Telangana High court, Justices Hima Kohli, HIgh Court Division Bench, Justice Vijaysen Reddy, Gattu Vaman Rao, PV Nagamani, Manthani, Ramagundam Police, Telangana, crime

A leaked audio conversation between the accused of the High Court advocate couple and supari gang leader is going viral on social media. Kunta Srinivas is the main accused in the murder of Vaman Rao and his wife Nagamani in Peddapalli district.

ITEMVIDEOS: న్యాయవాది హత్యకు కుంటా శ్రీనివాస్ సుపారీ.. అడియో ఇదో..

Posted: 02/18/2021 05:24 PM IST
Leaked audio talk between accused and supari gang leader going viral

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన న్యాయవాద దంపతుల కేసులో ప్రధాన నిందితుడిగా హతుడు పేర్కోన్న కుంటా శ్రీనివాస్ కు చెందిన ఆడియో టేపు నెట్టింట్లో వైరల్ గా మారింది. గుంజపడుగులోని కులదేవత ఆలయ వివాదమే హత్యకు గల ప్రధాన కారణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మృతుడు వామన్ రావు డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితుడు కుంటా శ్రీనివాస్ ఆడియోను పోలీసులు సేకరించారు. అతడి కాల్‌ డేటాను అనాలసిస్ చేయగా.. ‘గుడి కూలితే వామన్ రావు కూలిపోతాడు’ అని శ్రీనివాస్‌ మాట్లాడిన ఆడియో క్లిప్‌ కీలకంగా మారింది.

ఈ వీడియోలో గుంజపడుగు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కుంటా శ్రీనివాస్‌ జిల్లా చైర్మన్ పుట్టా మధుకు ముఖ్యఅనుచరుడిగా చెప్పుకున్నాడు. తాను నిత్యం అన్నతోనే వుండాలని చెప్పిన శ్రీనివాస్.. తమ ప్రత్యర్థిని మాత్రం అదృశ్యం చేయాలని.. ఆయన కుటుంభ సభ్యులు కూడా మిస్సింగ్ కేసు పెట్టేలా చేయాలని సుపారీ గ్యాంగ్ తో ఆయన మాట్లాడిన మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇందుకు గాను ఎంత మొత్తం కావాలన్న బేరసారాలను కూడా ఈ ఆడియో టేపులో స్పష్టంగా వినిపిస్తున్నాయి. సుపారీ గ్యాండ్ అడిగిన మొత్తం కన్నా అధికంగానే తాను ఇప్పిస్తానని శ్రీనివాస్ హామీ ఇచ్చాడు.

ఇక రానున్న ఐదేళ్లు తమ ప్రభుత్వమే అధికారంలో వుంటుందని.. ఈ ఐదేళ్లలో ఏం కావాలన్నా తాను చూసుకుంటానని చెప్పాడు. ఈ క్రమంలో మధన్నను నమ్మకుని గత కొన్ని ఏళ్లుగా వున్నానని, ఆయన సహాయంతో ఏకగా 26 నుంచి 28 ఎకరాల స్థలం కూడా తనకు అందిందని, అంతా మధన్న పుణ్యమేనని చెప్పుకోచ్చాడు. ఇక ఇటు మంధనిలో వున్న పోలీసు శాఖలో అందరు అధికారులు తమవారేనని చెప్పుకోచ్చిన శ్రీనివాస్.. తనపై వున్న నాలుగు కేసులను కూడా మధన్న తీయించాడని.. ఇక ఈశాఖలోనూ తమకు ఎవరూ అడ్డు చెప్పరని చెప్పకోచ్చాడు.

కాగా గుంజపడుగు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కుంటా శ్రీనివాస్‌పై గతంలో అనేక కబ్జా, బెదిరింపు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అదే విధంగా అతడు సింగరేణి కార్మిక సమాఖ్య(ఎస్ఈయు)లో పనిచేశాడని వెల్లడించారు. ఇక హత్య జరిగిన సమయంలో ఘటనాస్థలంలో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు తేల్చిన పోలీసులు.. కుంట శ్రీనివాస్‌ను త్వరిగతిన అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రామగుండం సీపీ సత్యనారాయణ సాయంత్రం మీడియా ముందుకు రానున్నారు. ఇక వామన్ రావు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏ–1గా కుంట శ్రీనివాస్‌, ఏ–2గా అక్కపాక కుమార్‌, ఏ–3గా వసంతరావును పేర్కొంటూ ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles