First woman to be hanged after India's Independence స్వతంత్ర భారతావనిలో ఉరి శిక్ష పడిన తొలి మహిళ..

First woman to be hanged after india s independence in mathura jail

Shabnam, Who is Shabnam, Shabnam hanging, Shabnam Amroha, Shabnam murders, Shabnam family members murder, Shabnam death sentence, salim, horrific crime, killed family members, axe, love affair, Mathura Jail, jail administration, Amroha, Uttar pradesh, crime

The jail administration has started preparations to hang a woman in Mathura jail. The woman who could be hanged inside Mathura jail is Shabnam, who belongs to Amroha, Uttar Pradesh. Shabman joined hands with his lover Salim to kill 7 of her own family members with an axe in April 2008.

స్వతంత్ర భారతావనిలో ఉరి శిక్ష పడిన తొలి మహిళ.. ఏర్పాటు సిద్దం

Posted: 02/17/2021 09:30 PM IST
First woman to be hanged after india s independence in mathura jail

స్వతంత్ర భారతావనిలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఉత్తర్ ప్రదేశ్ లోని మధుర జైలు అధికారులు ఓ శిక్ష అమలు చేయబోతున్నారు. అంతేకాదు ఏకంగా 150 ఏళ్ల భారత దేశ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి శిక్షను ఇక్కడి న్యాయస్థానాలు విధించలేదు. భారత దేశం అంటే కర్మభూమి.. ఇక్కడి మహిళల్లో మాతృత్వం కొలువై వుంటుందని, ఆర్తులకు అన్నం పెట్టి అక్కున చేర్చుకునే గోప్ప గుణం ఇక్కడి తల్లుల సోంతమని తెలిసిందే. అయితే ఇలాంటి తల్లుల చలువతోనే శాతబ్దమున్నర కాలం పాటు మహిళలకు ఇలాంటి శిక్షను విధించలేదు న్యాయస్థానం.

కానీ తొలిసారి ఉత్తర్ ప్రదేశ్ లోని మధుర జైలు అధికారులు అలాంటి ఓ శిక్షను అమలు పర్చుతున్నారు. తొలిసారి ఓ మహిళను ఉరికంభం ఎక్కించేందుకు సిద్దమయ్యారు. ఇంతకీ ఈ శిక్షను ఎదుర్కోనబోతున్న సదరు దోషి ఏం నేరం చేశారనేగా మీ సందేహం. తన ప్రేమకు కుటుంబసభ్యులు అడ్డువస్తున్నారని.. తన ప్రియుడితో కలసి ఏకంగా ఏడుగురు కుటుంబసభ్యులను అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి హతమార్చింది. అమె చేతిలో హతమైన వారిలో అమె తల్లి, తండ్రి, సోదరులు, సోదరి ఉండటం 2008 ఏప్రిల్ లో కలకలం రేపింది.

ఆంగ్లంలో ఎంఏ చేసిన షబ్నమ్.. ఐదో తరగతి కూడా పాస్ కాని  సలీంను ప్రేమించింది. ఎం.ఏ చదివిన ఈమె యుక్త వయస్సు రాగానే దారి తప్పింది. సలీంతో చట్టాపట్టాలేసుకుని పలు చోట్లుకు తిరుగడంపై అమె కుటుంబసభ్యులు వారించారు. దీంతో వీరంతా తన ప్రేమకు అడ్డుతగులుతున్నారని భావించిన అమె ప్రియుడితో కలసి పథకం వేసి.. వారందరినీ గొడ్డలితో పాశవికంగా నరికి చంపింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం నిందులను దోషులుగా నిర్ధారించి.. వారికి మరణశిక్షను విధించింది. దీంతో దోషులు ఉన్నత కోర్టులను ఆశ్రయిస్తూ చివరకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును కూడా చేరారు.

అయితే కేసు పూర్వాపరాలను, అధారాలను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం.. కింది కోర్టులు ఇచ్చిన తీర్పునే సమర్ధిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో చివరి ప్రయత్నంగా దోషులు తమకు క్షమాబిక్ష పెట్టాలని రాష్ట్రపతిని ఆశ్రయించారు. కాగా వారు పెట్టుకున్న పిటీషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు. తన ప్రేమ నిజమే అయితే కుటుంబసభ్యులను నిదానంగా ఒప్పించాల్సింది పోయి.. వారిని హతమార్చి పెళ్లి చేసుకోవాలనుకున్న వారి పట్లు రాష్ట్రపతి క్షమాభిక్షను ప్రసాదించేందుకు కూడా నిరాకరించారు.

దీంతో వీరిని ఉరి తీయడానికి మథుర జైలు అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్భయ కేసులో నిందితులను ఉరి వేసిన పవన్‌ జల్లాదే షబ్నమ్ నూ ఉరి తీయనున్నారు. ఇప్పటికైతే షబ్నమ్ ఉరి తేదీపై ఇంకా స్పష్టత లేకపోయినా.. అందుకు ఏర్పాట్లను మాత్రం చేస్తున్నారు. మహిళలను ఉరి తీసే కంభాన్ని 150 ఏళ్ల క్రితం అప్పటి అధికారులు మధుర జైలులోని నిర్మించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరూ ఇక్కడ శిక్షను అనుభవించలేదు. షబ్నమ్‌కు ముందు మహారాష్ట్రలోని అక్కాచెల్లెళ్లు సీమా గవిట్‌, రేణు షిండేలకు కూడా ఉరిశిక్ష పడింది. ఐదుగురు చిన్నారులను హత్య చేసిన కేసులో వీరు నిందితులు. వీరి క్షమాభిక్షను 2014లో రాష్ట్రపతి తిరస్కరించారు. వీరికింకా ఉరిశిక్ష అమలు కాలేదు. ప్రస్తుతం యరవాడ జైలులో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles